హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్... గోకర్ణ, మురుడేశ్వర్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్... గోకర్ణ, మురుడేశ్వర్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్... గోకర్ణ, మురుడేశ్వర్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్... గోకర్ణ, మురుడేశ్వర్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Karnataka Tour | కర్నాటకలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

ఈ చలికాలంలో ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). డివైన్ కర్నాటక పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఫ్లైట్‌లో కర్నాటక తీసుకెళ్లి కర్నాటకలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీలో కుక్కి, ధర్మస్థల, శృంగేరి, గోకర్ణ, మంగళూరు, మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపి లాంటి ప్రాంతాలను చూడొచ్చు. ఇది 4 రాత్రులు, 5 రోజుల టూర్. 2022 జనవరి 22న ఈ టూర్ మొదలవుతుంది. జనవరి 26న టూర్ ముగుస్తుంది.

IRCTC Divine Karnataka Tour: ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ వివరాలివే...


పర్యాటకులు మొదటి రోజు ఉదయం 9.40 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే 11.30 గంటలకు మంగళూరు చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత కుక్కి సుబ్రమణ్య స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ దర్శనం పూర్తైన తర్వాత ధర్మస్థల చేరుకోవాలి. మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత సాయంత్రం మంగళూరు బయల్దేరాలి. రాత్రికి మంగళూరులోనే బస చేయాలి.

IRCTC Shirdi Tour: సాయిబాబా భక్తులకు శుభవార్త... షిరిడీ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

రెండో రోజు ఉదయం శృంగేరి తీసుకెళ్తారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత కొల్లూరు తీసుకెళ్తారు. అక్కడ మూకాంబిక ఆలయాన్ని సందర్శించొచ్చు. మధ్యాహ్నం మురుడేశ్వర్ బయల్దేరాలి. ఆలయ దర్శనం తర్వాత రాత్రికి అక్కడే బస చేయాలి. మూడో రోజు ఉదయం గోకర్ణకు తీసుకెళ్తారు. అక్కడ ఆలయాన్ని సందర్శించిన తర్వాత బీచ్‌కు వెళ్లొచ్చు. ఆ తర్వాత జోగ్ ఫాల్స్ సందర్శించాలి. సాయంత్రం మురుడేశ్వర్ బయల్దేరాలి. రాత్రికి మురుడేశ్వర్‌లో బస చేయాలి.

నాలుగో రోజు ఉడుపి బయల్దేరాలి. అక్కడ సెయింట్ మేరీ ఐల్యాండ్ సందర్శించిన తర్వాత హోటల్‌లో చెకిన్ కావాలి. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించాలి. రాత్రికి ఉడుపిలోనే బస చేయాలి. ఐదో రోజు ఉదయం మంగళూరుకు బయల్దేరాలి. అక్కడ కటీల్ ఆలయాన్ని సందర్శించాలి. రాత్రి 9.50 గంటలకు మంగళూరు ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Araku Tour: వీకెండ్‌లో అరకు టూర్ వెళ్తారా? ఈ ప్యాకేజీ మీకోసమే

ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.23,600. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.24,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,950 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

First published:

Tags: Best tourist places, Irctc, IRCTC Tourism, Karnataka, Tourism, Tourist place, Travel

ఉత్తమ కథలు