మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఇ-టికెటింగ్ వెబ్సైట్ అప్‌గ్రేడ్ కాబోతోంది. కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా ప్రకటించారు. ఐఆర్సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ వెబ్సైట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ రానున్నాయి. కొత్త వెబ్సైట్ రైల్వే ప్రయాణికులు ఉపయోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. సులువుగా యాక్సెస్ చేయొచ్చు. ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లకుండా డిజిటల్ ఇండియాలో భాగంగా ఎక్కువ మంది ఆన్లైన్లో టికెట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
Doorstep Banking Services: ఈ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు
HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కొత్త ఫీచర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులకు 24 గంటలు సేవలు అందించడానిది దిశ చాట్‌బాట్ ఉంది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో 'Ask Disha' పేరుతో చాట్‌బాట్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ప్రయాణికులు దిశ చాట్బాట్లో ఎలాంటి ప్రశ్నలనైనా అడగొచ్చు. టికెట్ బుకింగ్, ట్రైన్ క్యాన్సలేషన్ లాంటి ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు.
Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు
ఇక బుక్ నౌ పే లేటర్ పేరుతో మరో సర్వీస్ అందిస్తోంది. అంటే ప్రయాణికులు డబ్బులు లేకపోయినా టికెట్లు బుక్ చేయొచ్చు. తర్వాత పేమెంట్ చేయొచ్చు. వీటితో పాటు ఇపేలేటర్, పే ఆన్ డెలివరీ పేరుతో మరిన్ని ఫీచర్స్‌ను అందిస్తోంది. రిజర్వ్డ్ టికెట్లతో పాటు తత్కాల్ టికెట్లకూ ఈ ఫీచర్స్ వర్తిస్తాయి. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్రయాణికులు 24 గంటల్లో టికెట్ పొందొచ్చు. 15 రోజుల్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:December 26, 2020, 13:32 IST