Good News: ఆ రైలు టికెట్ బుక్ చేస్తే ఐఆర్సీటీసీ నుంచి ట్యాక్సీ సేవలు
IRCTC Private Train Tejas Express | రైలు టికెట్ బుక్ చేసినవారికి హోటల్ బుకింగ్స్, ట్యాక్సీ, బ్యాగేజ్ పికప్ అండ్ డ్రాప్ లాంటి సర్వీసులు లభించనున్నాయి.
news18-telugu
Updated: September 10, 2019, 1:38 PM IST

Good News: ఆ రైలు టికెట్ బుక్ చేస్తే ఐఆర్సీటీసీ నుంచి ట్యాక్సీ సేవలు (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 10, 2019, 1:38 PM IST
భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలు 'ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్' పట్టాలు ఎక్కకముందే వార్తల్లో నిలుస్తోంది. ఆ రైలులో ఉండే సదుపాయాల దగ్గర్నుంచి ఛార్జీల వరకు అన్నీ చర్చనీయాంశమవుతున్నాయి. ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ రూట్లల్లో ప్రారంభం కానుంది. ముందుగా ఢిల్లీ-లక్నో రూట్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత మార్పుచేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ రూట్లో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనుంది ఐఆర్సీటీసీ. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు లగ్జరీ సేవలు అందనున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో రైలు టికెట్ బుక్ చేసినవారికి హోటల్ బుకింగ్స్, ట్యాక్సీ, బ్యాగేజ్ పికప్ అండ్ డ్రాప్ లాంటి సర్వీసులు లభించనున్నాయి. ఐఆర్సీటీసీ స్వయంగా ఈ సేవల్ని అందించనుంది. అంతేకాదు... అవసరమైనవారికి వీల్ ఛైర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది ఐఆర్సీటీసీ.
ఎయిర్‌పోర్టును ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంటే వేర్వేరు ఏవియేషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నట్టు, రైల్వే కూడా ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించాలి. తొలి ప్రైవేట్ రైలును నడుపుతున్న ఐఆర్సీటీసీ చాలా సేవల్ని అందించబోతోంది. ప్రయాణికులు కోరుకున్న ఆహారాన్ని వడ్డిస్తాం. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఇంటికి ట్యాక్సీ సేవల్ని అందిస్తాం. ఇంటి నుంచి స్టేషన్‌కు బ్యాగేజ్ సర్వీసులు, ఎంటర్టైన్మెంట్ సేవలు, వీల్‌చైర్ లాంటివి అందిస్తాం.
మూడేళ్ల పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారతీయ రైల్వే రెండు రైళ్లను ఐఆర్సీటీసీకి అప్పగించినట్టు యాదవ్ తెలిపారు. ఐఆర్సీటీసీ నడపించబోయే ప్రైవేట్ రైళ్లపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్‌లైన్ తరహాలో డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. అంటే ఫ్లైట్ ఛార్జీలు గంటగంటకు మారినట్టు, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు మారుతుంటాయి. ఇక ఈ ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటాలు ఉండవని తేలిపోయింది. ఒకవేళ రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది.
Photos: రిలయెన్స్ ట్రెండ్స్ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి
ఇవి కూడా చదవండి:IRCTC Scheme: స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌తో ఏసీలో జర్నీ... ఆ స్కీమ్ ఇదే
IRCTC: కొత్త జంటలకు గుడ్ న్యూస్... హనీమూన్ ప్యాకేజీ రూ.8760
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

— వీకే యాదవ్, రైల్వే బోర్డ్ ఛైర్మన్
గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?
Railway Jobs: రైల్వేలో 296 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
RRB NTPC Exam: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
IRCTC Sabarimala Tour: ఐఆర్సీటీసీ శబరిమల టూర్... ప్యాకేజీ రూ.2,990 మాత్రమే
Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 జాబ్స్... ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉద్యోగాలు
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
ఇవి కూడా చదవండి:IRCTC Scheme: స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌తో ఏసీలో జర్నీ... ఆ స్కీమ్ ఇదే
IRCTC: కొత్త జంటలకు గుడ్ న్యూస్... హనీమూన్ ప్యాకేజీ రూ.8760
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి