హోమ్ /వార్తలు /బిజినెస్ /

Shri Ramayana Express: రామ భక్తులకు శుభవార్త... మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్

Shri Ramayana Express: రామ భక్తులకు శుభవార్త... మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్

IRCTC Shri Ramayana Express: రామ భక్తులకు గుడ్ న్యూస్... మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shri Ramayana Express: రామ భక్తులకు గుడ్ న్యూస్... మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shri Ramayana Express | మీరు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నింటినీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ మరోసారి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను నడపబోతోంది. ఈ టూర్ విశేషాలు తెలుసుకోండి.

  శ్రీరామ భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ మళ్లీ నడుపుతున్నట్టు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. రామాయణానికి సంబంధం ఉన్న ప్రాంతాలన్నింటినీ చూడాలనుకునేవారి కోసం శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న సంగతి తెలిసిందే. శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలులో 10 కోచ్‌లు ఉంటాయి. అందులో 5 స్లీపర్ క్లాస్ నాన్ ఏసీ, 5 ఏసీ 3 టైర్ కోచ్‌లు ఉంటాయి. మొదట బుక్ చేసుకున్నవారికే ప్రాధాన్యం ఉంటుంది. మార్చి 28న ఢిల్లీలో శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ఢిల్లీ సఫ్దర్‌గంజ్, ఘజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, లక్నోలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కొచ్చు. 'రామాయణ సర్క్యుట్ ఆఫ్ ఇండియా'గా చెప్పుకునే శ్రీరాముడికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. 16 రాత్రులు, 17 రోజుల పాటు సాగుతుంది ఈ ప్రయాణం.

  irctc ramayana express, irctc shri ramayana express booking, how to book shri ramayana express, shri ramayan express train booking, irctc ramayana tour, ఐఆర్‌సీటీసీ రామాయణ ఎక్స్‌ప్రెస్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ బుకింగ్, శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ రైలు బుకింగ్, ఐఆర్‌సీటీసీ రామాయణ టూర్, ఇండియన్ రైల్వేస్ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్
  ప్రతీకాత్మక చిత్రం

  అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్ గఢి, నందిగ్రామ్‌లోని భరత్ మందిర్, బీహార్‌లోని సీతామర్హి సీతామాత మందిర్, నేపాల్‌లోని జనక్‌పూర్, వారణాసిలోని తులసీ మానస్ మందిర్, సంకట్ మోచన్ మందిర్, ఉత్తరప్రదేశ్‌లోని సీతా సమహిత్ స్థల్, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, ప్రయాగలోని భరద్వాజ ఆశ్రమం, శృంగవర్పూర్‌లోని శృంగీ రుషి మందిర్, చిత్రకూట్‌లోని రామ్‌ఘాట్, సతీ అనసూయ మందిర్, నాసిక్‌లోని పంచవటి, హంపిలోని అంజనాద్రి హిల్, హనుమాన్ జన్మ స్థలం, రామేశ్వరంలోని జ్యోతిర్లింగ శివ మందిర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. టూరిస్టులకు శాకాహార భోజనం, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ధర్మశాలలో, ఏసీ క్లాస్ బుకింగ్ ప్రయాణికులకు హోటళ్లలో వసతి ఏర్పాట్లు ఉంటాయి. నాన్ ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్ ఏర్పాటు చేస్తుంది ఐఆర్‌సీటీసీ.

  irctc ramayana express, irctc shri ramayana express booking, how to book shri ramayana express, shri ramayan express train booking, irctc ramayana tour, ఐఆర్‌సీటీసీ రామాయణ ఎక్స్‌ప్రెస్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ బుకింగ్, శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ రైలు బుకింగ్, ఐఆర్‌సీటీసీ రామాయణ టూర్, ఇండియన్ రైల్వేస్ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్
  ప్రతీకాత్మక చిత్రం

  ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే ఒక్కరికి స్లీపర్ క్లాస్ ధర రూ.16,065, ఏసీ క్లాస్ ధర రూ.26,775. ఇది కాకుండా శ్రీలంకలోని రామాయణ సంబంధిత ప్రాంతాలను చూడాలనుకుంటే అదనంగా రూ.37,800 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 40 సీట్లు మాత్రమే ఉంటాయి. శ్రీలంకకు చెన్నైలో ఏప్రిల్ 11న ప్రయణం మొదలవుతుంది. అక్కడ్నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో కొలంబో తీసుకెళ్తారు. శ్రీలంకలోని కాండీ, నువారా ఎలియా, నెగోంబో లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. సీతా మాత మందిర్, అసోక వాటికా, విభీషణ ఆలయం, మున్నేశ్వరంలోని శివాలయం లాంటి ప్రాంతాలను చూపిస్తారు. రిటర్న్ జర్నీ కొలంబోలో మొదలవుతుంది. కొలంబోలో ఫ్లైట్ ఎక్కితే టూరిస్టులు ఏప్రిల్ 15న ఢిల్లీ చేరుకుంటారు.

  గతేడాది కూడా శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ నడిపిన సంగతి తెలిసిందే. అప్పుడు రామభక్తుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం రోజుల్లో టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. దీంతో మళ్లీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను రామభక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది ఐఆర్‌సీటీసీ.

  ఇవి కూడా చదవండి:

  IRCTC Andaman Tour: తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్

  IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి అరకు, సింహాచలం టూర్ ప్యాకేజీ

  IRCTC: హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Indian Railway, Indian Railways, Irctc, Railways, Ramayana, Varanasi

  ఉత్తమ కథలు