రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే జూన్ 1 నుంచి మరో 200 ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. భారతీయ రైల్వే ఇప్పటికే కొన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, టూరిస్టులు, విద్యార్థుల కోసం ఈ రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. ఇప్పటి వరకు 1600 రైళ్లలో 21.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 200 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు గురువారం ఉదయం 10 గంటలకు టికెట్ బుకింగ్ ప్రారంభం కానుంది. టికెట్ బుకింగ్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో టికెట్లు అమ్మబోమని రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎవరూ రైలు టికెట్ల కోసం రైల్వే స్టేషన్‌కు రావొద్దని సూచించింది. అంటే ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేయాలి. బుకింగ్ ఎప్పుడు ప్రారంభిస్తామన్న వివరాలను భారతీయ రైల్వే త్వరలో ప్రకటించనుంది. బుకింగ్ ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
ముందుగా ఐఆర్టీసీ అధికారిక వెబ్సైట్ చేలా యాప్ ఓపెన్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. Book Your Ticket పైన క్లిక్ చేయాలి. ఏఏ రూట్లలో రైళ్లు నడుస్తున్నాయో ముందే తెలుసుకొని టికెట్లు బుక్ చేయడం మంచిది. రైల్వే స్టేషన్, ప్రయాణ తేదీ, ట్రావెల్ క్లాస్ ఎంచుకోవాలి. ఏ తేదీలో ప్రయాణించడానికైనా సరే అనుకుంటే Flexible with Date పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Find trains పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి. రైలు రూట్, టైమింగ్స్ చెక్ చేసుకొని ఎంచుకోవాలి. check availability & fare పైన క్లిక్ చేసి ఖాళీ బెర్తులు, ఛార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత Book Now పైన క్లిక్ చేయాలి. ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్‌లో ఏదైనా ఆప్షన్ ఎంచుకొని బుకింగ్ పూర్తి చేయాలి. బుకింగ్ పూర్తైన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఇవి కూడా చదవండి:
IRCTC Refund Rules: రైలు టికెట్లపై మారిన రీఫండ్ రూల్స్ ఇవే
EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఉద్యోగి వాటాపై కేంద్రం క్లారిటీ
EMI moratorium: ఈఎంఐ మారటోరియం విషయంలో ఈ తప్పు చేయొద్దు
Lockdown: క్రెడిట్ కార్డ్ ఉందా? లాక్డౌన్లో ఈ తప్పులు చేయొద్దుPublished by:Santhosh Kumar S
First published:May 21, 2020, 08:44 IST