భారతీయ రైల్వే కొన్ని ప్యాసింజర్ సర్వీసుల్ని మే 12 నుంచి నడుపుతోంది. మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 15 రూట్లల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి. ఆ రైళ్ల వివరాలు తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి. న్యూ ఢిల్లీ రూట్లో నడిచే ఈ రైళ్లు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్, అనంతపురం, గుంతకల్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఆయా ప్రాంతాల ప్రజలు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైళ్లు తక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మరి టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
IRCTC ticket booking: టికెట్లు బుక్ చేయండి ఇలా
ముందుగా ఐఆర్టీసీ అధికారిక వెబ్సైట్ చేలా యాప్ ఓపెన్ చేయండి.
మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Book Your Ticket పైన క్లిక్ చేయాలి.
ఏఏ రూట్లలో రైళ్లు నడుస్తున్నాయో ముందే తెలుసుకొని టికెట్లు బుక్ చేయడం మంచిది.
రైల్వే స్టేషన్, ప్రయాణ తేదీ, ట్రావెల్ క్లాస్ ఎంచుకోవాలి.ఏ తేదీలో ప్రయాణించడానికైనా సరే అనుకుంటే Flexible with Date పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Find trains పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి.
రైలు రూట్, టైమింగ్స్ చెక్ చేసుకొని ఎంచుకోవాలి.
check availability & fare పైన క్లిక్ చేసి ఖాళీ బెర్తులు, ఛార్జీల వివరాలు తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత Book Now పైన క్లిక్ చేయాలి.
ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్‌లో ఏదైనా ఆప్షన్ ఎంచుకొని బుకింగ్ పూర్తి చేయాలి.
బుకింగ్ పూర్తైన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఇవి కూడా చదవండి:
Special Trains: రేపటి నుంచి స్పెషల్ ట్రైన్స్... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచే సేల్
Cash Withdrawal: మీ ఏటీఎం కార్డుతో కిరాణా షాపులో డబ్బులు డ్రా చేయొచ్చు