భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలును ఐఆర్సీటీసీ నడపనుంది. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ చక్కర్లు కొట్టనుంది. ఈ ప్రైవేట్ రైలులో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ప్రైవేట్ రైలు అందుబాటులోకి రానుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. ఇండియన్ రైల్వేస్ నడిపించే రైళ్ల విషయంలో ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేసేది సమయపాలన గురించే. రైళ్లు ఎప్పుడూ టైమ్‌కు రావన్న కంప్లైంట్స్ ఎప్పుడూ ఉండేవే. ప్రైవేట్ రైళ్లు సమయానికే గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది ఐఆర్సీటీసీ. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది.
మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిపించనుంది ఐఆర్సీటీసీ. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఐఆర్సీటీసీ. ఇక ఎయిర్‌లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కే నాటికి సౌకర్యాలు, సదుపాయాల గురించి స్పష్టత రానుంది.
Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.