భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. టికెట్ బుకింగ్ విషయంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే విషయం ఇది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో రైల్వే టికెట్లు బుక్ చేయొచ్చన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వెంటనే రాదు. రీఫండ్ కోసం రెండు మూడు రోజులు ఆగాల్సి ఉంటుంది. ఇకపై అన్ని రోజులు రీఫండ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసిన వెంటనే రీఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది ఐఆర్‌సీటీసీ. అయితే ఐఆర్‌సీటీసీకి చెందిన పేమెంట్ గేట్‌వే IRCTC-ipay ద్వారా రైలు టికెట్లు బుక్ చేసినవారికే ఇన్‌స్టంట్ రీఫండ్ వర్తిస్తుంది.
Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్
ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి
ఐఆర్‌సీటీసీ ఐపే పేరుతో పేమెంట్ గేట్‌వే ప్లాట్‌ఫామ్‌ను 2019 లో ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ. రైలు టికెట్లు బుక్ చేసే సమయంలో ఐపే ప్లాట్‌ఫామ్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో పేమెంట్స్ చేయొచ్చు. ఈ పేమెంట్ గేట్‌వే వ్యవస్థ మొత్తం ఐఆర్‌సీటీసీ చేతుల్లో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ సొంత పేమెంట్ గేట్‌వే కాబట్టి రీఫండ్ వెంటనే ఇవ్వడం సులువవుతుంది. అందుకే రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ఐపే ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్ పూర్తి చేస్తే, ఆ రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడు రీఫండ్ వెంటనే వస్తుంది.
SBI New Charges: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త ఛార్జీలు
Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ... ఆఫర్ వివరాలు ఇవే
ఐఆర్‌సీటీసీ ఐపే ప్లాట్‌ఫామ్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయాలంటే https://www.irctc.co.in/ వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత జర్నీ వివరాలు ఎంటర్ చేయాలి. రైలు రూట్, టైమ్, బెర్త్ లాంటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ పేజ్‌లోకి వెళ్లాలి. అక్కడ రైలు ప్రయాణికులు పేమెంట్ కోసం ఐఆర్‌సీటీసీ ఐపే ప్లాట్‌ఫామ్ ఎంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ లేదా యూపీఐలో ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఐఆర్‌సీటీసీ ఐపే ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి. పేమెంట్ పూర్తి కాగానే ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా టికెట్ వివరాలు వస్తాయి. ఇలా ఐఆర్‌సీటీసీ ఐపే ద్వారా బుక్ చేసిన రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వెంటనే అకౌంట్‌లోకి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, IRCTC, Railways, Special Trains, Train, Train tickets, Travel