Home /News /business /

IRCTC TICKET CANCELLATION RULES 2019 YOU CANT GET REFUND IN THESE 10 SITUATIONS SS

IRCTC Rules: టికెట్ రీఫండ్ రిజెక్ట్ కావడానికి 10 కారణాలివే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC Ticket Cancellation Rules | ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ‘booked tickets’ సెక్షన్‌లో టికెట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇవ్వదు.

    మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? టికెట్ రిజర్వేషన్ చేయించుకొని ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకున్నారా? టికెట్ రీఫండ్ విషయంలో సమస్యలు ఎదురయ్యాయా? మీకే కాదు... రోజూ లక్షలాది మందికి ఇదే సమస్య. టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ సరిగ్గా అర్థం చేసుకుంటే రీఫండ్ సులువుగా పొందొచ్చు. లేకపోతేనే మీ రీఫండ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ‘booked tickets’ సెక్షన్‌లో టికెట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇవ్వదు. ఆ 10 కారణాలేంటో తెలుసుకోండి.

    1. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు కన్ఫామ్ అయిన టికెట్ క్యాన్సిల్ చేయకపోయినా, టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రీఫండ్ రాదు.
    2. ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందుగానే క్యాన్సిల్ చేయకపోతే రీఫండ్ రాదు.
    3. అనూహ్యంగా టికెట్ క్యాన్సిల్ అయినా, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసినా మొత్తం రీఫండ్ రాదు. ఇండియన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం ఛార్జీలు ఉంటాయి.
    4. ఆర్ఏసీ ఇ-టికెట్స్ క్యాన్సిల్ చేయకపోయినా, రైలు బయల్దేరే సమయానికి 30 నిమిషాల ముందు టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రీఫండ్ పొందలేరు.
    5. ఇ-టికెట్స్‌లో కొన్ని మాత్రమే కన్ఫామ్ అయ్యాయని ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే రీఫండ్ వర్తించదు.
    6. రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నా రైలు వాస్తవంగా బయల్దేరాల్సిన సమయం తర్వాత క్యాన్సలేషన్ చేసినా రీఫండ్ పొందలేరు.
    7. చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్ఏసీ టికెట్ వచ్చిందని ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే రీఫండ్ వర్తించదు.
    8. ఐ-టికెట్స్ పోగొట్టుకున్నా, చిరిగిపోయినా ప్రయాణికులు డూప్లికేట్ టికెట్ పొందొచ్చు. కానీ రీఫండ్ అడగలేరు.
    9. ప్రీమియం స్పెషల్ రైళ్లల్లో బుక్ చేసిన CNF/RAC టికెట్లకు క్యాన్సలేషన్ ఉండదు.
    10. చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో లేకపోతే రీఫండ్ పొందలేరు.

    Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

    ఇవి కూడా చదవండి:

    SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

    SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...

    UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
    First published:

    Tags: Indian Railways, Irctc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు