Home /News /business /

IRCTC TICKET CANCELLATION KNOW HOW TO CANCEL RAILWAY COUNTER TICKET ON IRCTC WEBSITE SS

IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

IRCTC Ticket Cancellation | కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్‌ను కూడా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయొచ్చు. రీఫండ్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    భారతీయ రైల్వే చాలా ముందుగా రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించింది. తర్వాత టికెట్లు దొరుకుతాయో లేదోనని జర్నీ సరిగ్గా ప్లాన్ చేసుకోకున్నా ముందే టికెట్లు బుక్ చేసి పెట్టుకోవడం చాలామంది అలవాటు. తర్వాత ప్లానింగ్‌లో ఏదైనా మార్పులు ఉంటే టికెట్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సలేషన్ ఫీజు చెల్లించక తప్పదు. రైల్వే కౌంటర్లు, స్టేషన్లు, రిజర్వేషన్ ఆఫీసులు, బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకున్న టికెట్లతో పాటు ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ www.irctc.co.in లో బుక్ చేసుకున్న టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకప్పుడు టికెట్ బ్యాన్సిల్ చేయాలంటే రైల్వే కౌంటర్‌కు, రిజర్వేషన్ ఆఫీసుకు వెళ్లడం తప్పనిసరి. టెక్నాలజీ సాయంతో ఇప్పుడు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టే క్యాన్సిలేషన్ కూడా ఆన్‌లైన్‌ జరిగిపోతుంది. అంతేకాదు... కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్‌ను కూడా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయొచ్చు. రీఫండ్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    Read this: IRCTC: రైలు టికెట్‌లో తప్పులుంటే ఇలా సరిచేసుకోండి

    IRCTC Ticket Cancellation, cancel railway counter ticket, counter ticket cancellation, counter ticket cancellation procedure, counter ticket cancellation online, counter ticket cancellation refund, cancel counter ticket, cancel counter train ticket online, cancel train ticket online irctc, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్, ఐఆర్‌సీటీసీ క్యాన్సలేషన్ రూల్స్, రైలు టికెట్ క్యాన్సలేషన్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ ఆన్‌లైన్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ నిబంధనలు


    కౌంటర్‌లో బుక్ చేసిన టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయండి ఇలా...


    1. ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.in ఓపెన్ చేయండి.
    2. హోమ్‌ పేజీలో ‘Trains’ ఆప్షన్స్‌ పైన క్లిక్ చేయండి.
    3. డ్రాప్‌డౌన్ మెనూలో ‘Cancel Ticket’ పైన క్లిక్ చేయండి.
    4. ఆ తర్వాత ‘Counter Ticket’ ఆప్షన్ ఎంచుకోండి.
    5. ట్రైన్ టికెట్ పైన ప్రింట్ చేసిన ట్రైన్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి.
    6. నిబంధనలు చదివి, బాక్స్ టిక్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
    7. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.
    8. బుకింగ్ సమయంలో ఇచ్చిన మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
    9. పీఎన్ఆర్ వివరాలను వెరిఫై చేయండి.
    10. చివరగా ‘Cancel Ticket’ పైన క్లిక్ చేస్తే చాలు.

    Read this: IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి

    IRCTC Ticket Cancellation, cancel railway counter ticket, counter ticket cancellation, counter ticket cancellation procedure, counter ticket cancellation online, counter ticket cancellation refund, cancel counter ticket, cancel counter train ticket online, cancel train ticket online irctc, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్, ఐఆర్‌సీటీసీ క్యాన్సలేషన్ రూల్స్, రైలు టికెట్ క్యాన్సలేషన్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ ఆన్‌లైన్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్, కౌంటర్ టికెట్ క్యాన్సలేషన్ నిబంధనలు

    డిస్‌ప్లే పైన మీ రీఫండ్ అమౌంట్ కనిపిస్తుంది. మీక పీఎన్ఆర్‌ నెంబర్‌తో ఎస్ఎంఎస్, రీఫండ్ వివరాలు వస్తాయి. మీరు టికెట్ క్యాన్సిల్ చేసిన సమయాన్ని బట్టి రీఫండ్ వస్తుంది. రైలు బయల్దేరే సమయానికి 24 గంటల ముందు, 24 గంటల లోపు, నాలుగు గంటల ముందు, 30 నిమిషాల లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే వేర్వేరుగా రీఫండ్ నిబంధనలు వర్తిస్తాయి. నిబంధనలు సరిగ్గా తెలుసుకొని క్యాన్సిల్ చేస్తే మీ రీఫండ్ రిజెక్ట్ కాదు. రీఫండ్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    Good Friday 2019: గుడ్‌ఫ్రైడే నాడు స్ఫూర్తినిచ్చే 10 కొటేషన్స్

    ఇవి కూడా చదవండి:

    SBI Loan: ఎస్‌బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు

    NIOS Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 90 ఉద్యోగాలు

    Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ
    First published:

    Tags: Indian Railways, Irctc, Railways

    తదుపరి వార్తలు