IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

IRCTC Ticket Cancellation and Refund Rules 2020 | ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయడం సులువే. ఐఆర్‌సీటీసీలో బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేసేందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: January 7, 2020, 3:27 PM IST
IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి
IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సంక్రాంతి సెలవుల్లో ఊరెళ్లేందుకు రైలు టికెట్ బుక్ చేశారా? మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే ముందు ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ తెలుసుకోండి. లేకపోతే రీఫండ్ సమయంలో చిక్కులు తప్పవు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC... రైళ్లల్లో ప్రయాణించేవారికి ఈ సంస్థ గురించి తెలిసిందే. రైల్వే ప్రయాణికులకు రైలు టికెట్ల బుకింగ్ దగ్గర్నుంచి కేటరింగ్ సర్వీసుల వరకు అనేక సేవల్ని అందిస్తుంది ఐఆర్‌సీటీసీ. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయడం సులువే. ఐఆర్‌సీటీసీలో బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేసేందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

1. ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్‌ని 2015 నుంచి అమలు చేస్తోంది. పేపర్‌లెస్ టికెటింగ్‌ని ప్రోత్సహించడం, దుర్వినియోగం చేయడం, ఏజెంట్లను దళారుల ప్రమేయం లేకుండా చేయడం, టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్లకుండా చూడటం కోసం రీఫండ్ రూల్స్‌ని సవరించింది. 2019 లో రెండు కొత్త రీఫండ్ రూల్స్‌ని యాడ్ చేసింది.

2. అన్‌రిజర్వ్‌డ్, ఆర్ఏసీ, వెయిట్ లిస్టింగ్‌లో ఉన్న టికెట్లను క్యాన్సిల్ చేస్తే రూ.30, సెకండ్ క్లాస్ (రిజర్వ్‌డ్), ఇతర క్లాస్‌లకు రూ.60 ఛార్జీలు చెల్లించాలి. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు కన్ఫామ్డ్ రిజర్వ్‌డ్ టికెట్లు క్యాన్సిల్ చేస్తే ఏసీ ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌కు రూ.240, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్‌కు రూ.200, థర్డ్ ఏసీకి రూ.180, స్లీపర్ క్లాస్‌కు రూ.120, సెకండ్‌ క్లాస్‌కు రూ.60 ఛార్జీలు చెల్లించాలి.

IRCTC rules 2020, IRCTC ticket cancellation Rules 2020, IRCTC Refund Rules 2020, Indian Railways ticket cancellation Rules 2020, Indian Railways ticket Refund Rules 2020, Indian Railways, ఐఆర్‌సీటీసీ రూల్స్ 2020, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ 2020, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్ టికెట్ రీఫండ్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే
ప్రతీకాత్మక చిత్రం


3. రైలు బయల్దేరడానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తే టికెట్ ఛార్జీల్లో 25% క్యాన్సలేషన్ ఛార్జీలు చెల్లించాలి. రైలు బయల్దేరడానికి 12 గంటల నుంచి 4 గంటల మధ్య రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ ఛార్జీలో 50% క్యాన్సలేషన్ ఛార్జీలు చెల్లించాలి.రైలు బయల్దేరడానికి అరగంట ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే పాక్షిక రీఫండ్ మాత్రమే వర్తిస్తుంది. అదే వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్లు రైలు బయల్దేరడానికి అరగంట ముందు క్యాన్సిల్ చేస్తే క్లర్కేజ్ ఛార్జీలు ఉంటాయి.

4. ఇ-టికెట్ క్యాన్సలేషన్‌కు ఆటోమెటిక్ రీఫండ్ వర్తిస్తుంది. టీడీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియం స్పెషల్ రైళ్ల కన్ఫామ్డ్, ఆర్ఏసీ టికెట్లకు క్యాన్సలేషన్ అనుమతించరు. ఒకవేళ రైలు రద్దైతే పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా రీఫండ్ చెల్లిస్తారు. ఒకవేళ సూచించిన సమయంలో రైల్వే టికెట్‌ను సరెండర్ చేస్తే పీఆర్ఎస్ కౌంటర్ ద్వారా రీఫండ్ లభిస్తుంది. ఒకవేళ ఐఆర్‌సీటీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్ క్యాన్సిల్ చేస్తే 139 నెంబర్‌కు కాల్ చేసి రిజర్వేషన్ కౌంటర్‌లో రీఫండ్ తీసుకోవచ్చు.

5. ఒకవేళ ఆన్‌లైన్‌లో టికెట్ క్యాన్సిల్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌కు రీఫండ్ 5 రోజుల్లో వస్తుంది. రైల్వే స్టేషన్ కౌంటర్‌లో టికెట్ క్యాన్సిల్ చేస్తే 7 రోజుల్లో రీఫండ్ లభిస్తుంది. ఉపయోగించని రైలు టికెట్లకు రీఫండ్ కావాలనుకుంటే ప్రధాన రైల్వే స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లను లేదా మేనేజర్లను సంప్రదించాలి. రీఫండ్ ఇవ్వడం వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
IRCTC rules 2020, IRCTC ticket cancellation Rules 2020, IRCTC Refund Rules 2020, Indian Railways ticket cancellation Rules 2020, Indian Railways ticket Refund Rules 2020, Indian Railways, ఐఆర్‌సీటీసీ రూల్స్ 2020, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ 2020, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్ టికెట్ రీఫండ్ రూల్స్ 2020, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే
ప్రతీకాత్మక చిత్రం


6. వరదలు, బంద్‌, ఆందోళనల కారణంగా రిజర్వేషన్ కౌంటర్‌కు చేరుకోకపోతే మూడు రోజుల్లో టికెట్ డిపాజిట్ రిసిప్ట్-TDR ఫైల్ చేయొచ్చు. చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు దరఖాస్తు చేయాలి. టీడీఆర్ ద్వారా 90 రోజుల్లో రీఫండ్ పొందొచ్చు. పోగొట్టుకున్న రైలు టికెట్లకు రీఫండ్ ఇవ్వరు. చిరిగిన, ముక్కలైన రైలు టికెట్లకు వెరిఫై చేసిన తర్వాత రీఫండ్ ఇస్తారు. ఒకవేళ పోగొట్టుకున్న రైలు టికెట్ కన్ఫామ్ లేదా ఆర్ఏసీ అయితే డూప్లికేట్ పర్మిట్ ట్రావెల్ ఇస్తారు. దీనికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

7. తత్కాల్ టికెట్లు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టికెట్లు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసినా రీఫండ్ రాదు. ఆ సమయంలో టీడీఆర్ ఫైలింగ్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఓ కుటుంబం లేదా బృందం రైలు టికెట్లు బుక్ చేసుకుంటే వారిలో కొందరికి టికెట్లు కన్ఫామ్ అయి, ఇంకొందరికి ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ వస్తే మొత్తం రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడు మొత్తం రీఫండ్ వస్తుంది. క్లర్కేజ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇందుకోసం ఆన్‌లైన్ టీడీఆర్ ఫైల్ చేయాలి. అది కూడా రైలు బయల్దేరడానికి అరగంట ముందు టికెట్లు క్యాన్సిల్ చేయాలి.

8. గతేడాది ఐఆర్‌సీటీసీ ఓటీపీ బేస్డ్ రీఫండ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎస్ఎంఎస్‌లో ఓటీపీ వస్తుంది. ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఓటీపీ చూపించి రీఫండ్ తీసుకోవచ్చు. గతేడాది పీఎన్ఆర్ లింకింగ్ నిబంధన కూడా అమలులోకి వచ్చింది. ఓ వ్యక్తి రెండు రైళ్లు కనెక్ట్ అయ్యేలా బుకింగ్ చేసుకుంటే పీఎన్ఆర్ లింక్ చేయాలి. మొదటి రైలు ఆలస్యం కారణంగా రెండో రైలు మిస్ అయినప్పుడు రీఫండ్ పొందొచ్చు. అయితే మూడు గంటల్లో రైలు టికెట్‌ను సరెండర్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

IRCTC: తక్కువ ధరకే పూరీ, గయ యాత్ర... తెలుగు రాష్ట్రాల నుంచి టూర్ ప్యాకేజీ

IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు

IRCTC: ప్రేమికులకు శుభవార్త... వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
First published: January 7, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading