Home /News /business /

IRCTC TICKET AUTO UPGRADATION SCHEME TRAVEL IN THIRD AC CLASS WITH SLEEPER CLASS TICKET FOR FREE KNOW HOW SS

IRCTC: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఉచితంగా థర్డ్ ఏసీ ప్రయాణం... ఆటో అప్‌గ్రేడేషన్‌ స్కీమ్

Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

Irctc Ticket Auto Upgradation Scheme | మీకు స్లీపర్ క్లాస్‌‌లో బెర్త్ దొరికే పరిస్థితి లేకపోతే థర్డ్ ఏసీకి అప్‌గ్రేడ్ అవుతుంది. థర్డ్ ఏసీలో బెర్తులు ఖాళీగా ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది.

    చాలా ముందుగా బుక్ చేసుకుంటే రైలు టికెట్ సులువుగానే దొరుకుతుంది. కానీ... చివరి నిమిషంలో బుకింగ్ చేసుకునేవాళ్లకే టికెట్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ తప్పదు. ఆ టెన్షన్‌ను కాస్త తగ్గించేందుకు ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ ప్రవేశపెట్టింది ఐఆర్‌సీటీసీ. ఉదాహరణకు మీరు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి. చివరి నిమిషం వరకు మీకు బెర్త్ దొరక్కపోతే టికెట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ అదే రైలులో థర్డ్ ఏసీ క్లాస్‌లో సీట్లు ఖాళీగా ఉంటే అయ్యో 3AC ఎంచుకోలేదని మీరు బాధపడిపోతారు. అదే మీరు ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకున్నారంటే మీరు బుక్ చేసుకున్నారంటే మీకు స్లీపర్ క్లాస్‌‌లో బెర్త్ దొరికే పరిస్థితి లేకపోతే థర్డ్ ఏసీకి అప్‌గ్రేడ్ అవుతుంది. థర్డ్ ఏసీలో బెర్తులు ఖాళీగా ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. ఇందుకోసం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. స్లీపర్ క్లాస్ టికెట్‌తో థర్డ్ ఏసీలో ఉచితంగా ప్రయాణించొచ్చు.

    Read this: FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

    ఐఆర్‌సీటీసీ ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్... నియమనిబంధనలు ఇవే...


    ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు 'ఆటో క్లాస్ అప్‌గ్రేడేషన్' ఆప్షన్ ఇస్తోంది ఐఆర్‌సీటీసీ.
    టికెట్ బుకింగ్ సమయంలోనే ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
    కన్సెషన్ టికెట్, ఫ్రీ పాస్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్లకు ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ వర్తించదు.
    రిజర్వేషన్ చార్ట్స్ సిద్ధం చేసే సమయంలో ర్యాండమ్‌ పద్ధతిలో ఆటోమెటిక్‌గా అప్‌గ్రేడేషన్ జరుగుతుంది.
    పై క్లాస్‌కు మాత్రమే అప్‌గ్రేడేషన్ వర్తిస్తుంది. అంటే స్లీపర్ క్లాస్ ఎంచుకున్నవాళ్లకు థర్డ్ ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
    3AC ఎంచుకున్నవారికి సెకండ్ ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
    2AC ఎంచుకున్నవారికి ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తారు.
    వెయిట్‌లిస్టెడ్‌లో ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ వర్తిస్తుంది.
    రైలులో వెయిటింగ్ లిస్ట్ లేకపోతే అప్‌గ్రేడేషన్ ఉండదు.
    ఒకే పీఎన్ఆర్ కింద ఉన్న ప్రయాణికులందరి టికెట్లను ఒకేసారి అప్‌గ్రేడ్ చేస్తారు.
    క్లాస్ అప్‌గ్రేడ్ చేసినా పీఎన్ఆర్ నెంబర్ మారదు.
    ఒకవేళ అప్‌గ్రేడ్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేస్తే ఒరిజినల్ క్లాస్‌ రీఫండ్ మాత్రమే వస్తుంది.
    2S, CC, EC లాంటి సిట్టింగ్ అకామడేషన్ ఉన్న రైళ్లకు ఆటో అప్‌గ్రేడేషన్ వర్తించదు.

    Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

    Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్

    PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు
    First published:

    Tags: Irctc, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు