IRCTC Tejas Express: తొలి ప్రైవేట్ రైలులో ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?

IRCTC Tejas Express | ఇప్పటికే కొన్ని రైళ్లల్లో ఈ తరహా డైనమిక్ ప్రైసింగ్ ఉంది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందని తెలుస్తోంది.

news18-telugu
Updated: September 5, 2019, 3:55 PM IST
IRCTC Tejas Express: తొలి ప్రైవేట్ రైలులో ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
IRCTC Tejas Express: తొలి ప్రైవేట్ రైలులో ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 5, 2019, 3:55 PM IST
భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలు పట్టాలు ఎక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మధ్య ప్రైవేట్ రైళ్లను నడిపే బాధ్యతను ఐఆర్‌సీటీసీకి అప్పగించింది భారతీయ రైల్వే. తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిచే రెండు ప్రీమియం రైళ్ల గురించి ప్రయాణికుల్లో చర్చ జరుగుతోంది. రైళ్లు ఎలా ఉంటాయి? రైళ్లల్లో ప్రయాణికులకు అందే సౌకర్యాలేంటీ? ఛార్జీలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఛార్జీలు ఎయిర్‌లైన్ తరహాలో ఉంటాయని తెలుస్తోంది. అంటే మీరు ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఎప్పుడూ ఒకే ఛార్జీలు ఉండవు. రోజుకో ఫేర్ కనిపిస్తుంది. ఛార్జీలు గంటగంటకు మారుతుంటాయి. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఛార్జీలు పెరుగుతుంటాయి. దీన్నే డైనమిక్ ప్రైసింగ్ అంటారు. ఇప్పటికే కొన్ని రైళ్లల్లో ఈ తరహా డైనమిక్ ప్రైసింగ్ ఉంది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందని తెలుస్తోంది.

బిజీ రూట్లల్లో ఈ ప్రైవేట్ రైళ్లను నడిపించనుంది భారతీయ రైల్వే. మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్-ముంబై రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే ప్రైవేట్ రైళ్లు ఎక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు లగ్జరీ సదుపాయాలను, ప్రయాణాన్ని అందించనుండటం విశేషం. అయితే అవే రూట్లల్లో నడిచే విమాన ఛార్జీల కన్నా 50% లోపే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. డైనమిక్ ప్రైసింగ్ ఉన్నా... ఫ్లైట్ ఛార్జీలో 50% మించకుండా పరిమితి విధిస్తారు. ఈ ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటాలు ఉండవు. అంటే ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు టికెట్‌పై తగ్గింపు ఇస్తున్నట్టు ఇందులో కన్సెషన్ ఉండదు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే ఎలాంటి కన్సెషన్ లేకుండానే టికెట్ తీసుకోవాలి.

ఈ ప్రైవేట్ రైళ్లల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రైవేట్ రైళ్లు సమయానికే గమ్యస్థానాలకు చేరుకునేలా నడపనుంది ఐఆర్‌సీటీసీ. ఒకవేళ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇక ఎయిర్‌లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

LIC: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించట్లేదా? పెయిడ్-అప్‌గా మార్చండి ఇలా
Loading...
Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...