రైలు ఆలస్యమైందని ప్రయాణికులకు రూ.63,000 నష్టపరిహారం

IRCTC Tejas Express Refund Rules | రైలు ఆలస్యంగా వస్తే నష్టపరిహారం ఇస్తామని ఐఆర్‌సీటీసీ ముందే ప్రకటించింది. రైలు గంటకన్నా ఎక్కువ ఆలస్యంగా వస్తే రూ.100 చొప్పున, రెండు గంటల కన్నా ఎక్కువ ఆలస్యంగా వస్తే రూ.250 చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పింది ఐఆర్‌సీటీసీ.

news18-telugu
Updated: January 23, 2020, 10:59 AM IST
రైలు ఆలస్యమైందని ప్రయాణికులకు రూ.63,000 నష్టపరిహారం
రైలు ఆలస్యమైందని ప్రయాణికులకు రూ.63,000 నష్టపరిహారం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం పెద్ద వింతేమీ కాదు. రైలు సమయానికి ప్లాట్‌ఫామ్‌పైకి వస్తేనే వింత. అయితే ఇటీవల కాలంలో కొన్ని రైళ్లు సమయానికే స్టేషన్‌కు వచ్చేస్తున్నాయి. ఇక ఇటీవల పట్టాలెక్కిన తొలి ప్రైవేట్ రైలు ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ సమయపాలనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. అంతేకాదు... రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు నష్టపరిహారం కూడా ఇస్తామని ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ప్రతిపాదన ప్రయాణికుల్లో విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడింది. మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ న్యూఢిల్లీ-లక్నో రూట్‌లో సక్సెస్ కావడంతో అహ్మదాబాద్-ముంబై రూట్‌లో రెండో రైలు అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబై రూట్‌లో రైలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. అహ్మదాబాద్‌లో ఉదయం 6.42 గంటలకు బయల్దేరిన రైలు ముంబై సెంట్రల్‌ఖు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2.36 గంటలకు రైలు ముంబై సెంట్రల్‌కు వచ్చింది.

రైలు ఆలస్యంగా వస్తే నష్టపరిహారం ఇస్తామని ఐఆర్‌సీటీసీ ముందే ప్రకటించింది. రైలు గంటకన్నా ఎక్కువ ఆలస్యంగా వస్తే రూ.100 చొప్పున, రెండు గంటల కన్నా ఎక్కువ ఆలస్యంగా వస్తే రూ.250 చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పింది ఐఆర్‌సీటీసీ. అహ్మదాబాద్-ముంబై రూట్‌లో రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యంగా వచ్చింది కాబట్టి ప్రయాణికులకు రూ.100 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వనుంది ఐఆర్‌సీటీసీ. మొత్తం 630 మంది ప్రయాణికులకు రూ.63,000 నష్టపరిహారాన్ని చెల్లించనుంది. రీఫండ్ పాలసీ నియమనిబంధనల ప్రకారం ప్రయాణికులు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత రీఫండ్ లభిస్తుంది. ఐఆర్‌సీటీసీ రెండో ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్-ముంబై మధ్య జనవరి 19 నుంచి సేవలు అందిస్తోంది. సేవలు మొదలైన నాలుగోరోజే రైలు ఆలస్యం కావడం చర్చనీయాంశమవుతోంది.

ఇవి కూడా చదవండి:

Indian Railways: విద్యార్థులకు భారతీయ రైల్వే నుంచి అద్భుత అవకాశంIRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర... తక్కువ ధరకే ప్యాకేజీ

IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్... 'వాలెంటైన్స్ డే టూర్' తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు