HOME »NEWS »BUSINESS »irctc tatkal ticket booking hakcers using pakistani software to break irctc tatkal system ss

IRCTC Tatkal: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌పై పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్‌తో ఎటాక్

IRCTC Tatkal: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌పై పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్‌తో ఎటాక్
IRCTC Tatkal: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌పై పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్‌తో ఎటాక్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tatkal Ticket Booking | ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవహారంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌ను బ్రేక్ చేసేందుకు హ్యాకర్లు పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించినట్టు తేలింది.

  • Share this:
    ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు ఇల్లీగల్ ఆపరేటర్స్, హ్యాకర్స్ పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF గుర్తించింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇండియన్ రైల్వేస్‌తో పాటు, బ్యాంకు ఓటీపీలను బైపాస్ చేసి మరీ తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నట్టు బయటపడింది. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన ఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ ముఠాను పట్టుున్నారు. దేశవ్యాప్తంగా అక్రమ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ, బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ బైపాస్ చేసి టికెట్లు బుక్ చేస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లోనే ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. దీంతో అప్పట్నుంచి నిఘా పెట్టిన రైల్వే పోలీసులు... ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తే పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నాడని, సాధారణ ఛార్జీల కన్నా ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.

    JioFiber Free Trail: జియోఫైబర్ 30 రోజులు ఫ్రీ... అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితం



    Smartphones: ఆగస్టులో రిలీజైన స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర, ఫీచర్స్ తెలుసుకోండి

    గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి అక్టోబర్‌లో పారిపోయాడు. అప్పట్నుంచి ఆచూకీ కోసం వెతుకుతున్నారు పోలీసులు ఒడిషాలో అతడిని పట్టుకొని బెంగళూరుకు తీసుకొచ్చారు. బెంగళూరు ఆర్‌పీఎఫ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో షాకిచ్చే విషయాలు బయటపడ్డాయి. లైనక్స్ బేస్డ్ సిస్టమ్‌పై పనిచేసే పాకిస్తానీ సాఫ్ట్‌వేర్‌ హ్యాకింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉందని వెల్లడించాడు. ఏకంగా ఇస్రో, రైల్వే, ప్రభుత్వ సంస్థలకు చెందిన అప్లికేషన్స్‌ని కూడా పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ బ్రేక్ చేయగలదని తేలింది. అతను ఏకంగా 3,000 బ్యాంక్ అకౌంట్లతో పాటు బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్నట్టు విచారణలో బయటపడింది. అతడిని విచారిస్తే బ్లాక్‌మార్కెట్‌లో 25,000 మంది హ్యాకర్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దేశమంతా ఈ రాకెట్‍ను నడిపిస్తోంది వీళ్లేనని తేలింది. దేశవ్యాప్తంగా 100 మంది ప్యానెల్ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్ సెల్లర్స్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ కోడ్స్‌ని సీజ్ చేశారు.
    Published by:Santhosh Kumar S
    First published:September 02, 2020, 11:09 IST