IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈజీగా చేయొచ్చు ఇలా

IRCTC Tatkal Booking | తత్కాల్ టికెట్ కోసం సెకండ్ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం, ఇతర క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాలి.

news18-telugu
Updated: April 23, 2019, 5:53 PM IST
IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈజీగా చేయొచ్చు ఇలా
IRCTC Tatkal Booking: Know how to book IRCTC tatkal train tickets in few easy steps
news18-telugu
Updated: April 23, 2019, 5:53 PM IST
అత్యవసరంగా రైలులో ప్రయాణించాలనుకునేవారిని ఆదుకునేది తత్కాల్ బుకింగ్. ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా రైలు రిజర్వేషన్ చేయించుకోవచ్చు. కానీ... అనుకోకుండానో, అత్యవసరంగానో ఎక్కడికైనా వెళ్లాలంటే తత్కాల్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. తత్కాల్ బుకింగ్ రైలు బయల్దేరడానికి ముందు రోజు ఓపెన్ అవుతుంది. అంటే రేపు ప్రయాణించాలనుకుంటే ఇవాళ తత్కాల్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఏసీ క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ క్లాస్‌కు ఉదయం 11 గంటలకు విండో ఓపెన్ చేస్తారు. తత్కాల్ టికెట్ కోసం సెకండ్ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం, ఇతర క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాలి. సాధారణంగా తత్కాల్ టికెట్లు క్షణాల్లో బుక్ అవుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి బుక్ చేస్తేనే టికెట్ దొరుకుతుంది. మరి సులువుగా తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

Read this: IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే

IRCTC Tatkal Booking, IRCTC tatkal train tickets, irctc tatkal booking, irctc tatkal booking timings, tatkal ticket availability, tatkal booking online, irctc tatkal booking app, tatkal ticket booking software, tatkal booking timings 2019, tatkal booking charges, ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్, రైలు తత్కాల్ బుకింగ్, తత్కాల్ బుకింగ్ టైమింగ్స్, తత్కాల్ బుకింగ్ ఛార్జీలు



ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్ ఫాలో అవండి


మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.


'Book Your Ticket' పేజీలో మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేయాలి.
తర్వాతి పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి.
Loading...
మీరు బుక్ చేయాలనుకున్న ట్రైన్ పైన క్లిక్ చేసి క్లాస్ ఎంచుకోవాలి.
తత్కాల్ టికెట్ కోసం కోటా ఆప్షన్‌లో 'Tatkal' పైన క్లిక్ చేయాలి.
చివరగా 'Book Now' బటన్ పైన క్లిక్ చేయాలి.
ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
'Consider for Auto Upgradation' ఎంచుకుంటే ఆటోమెటిక్ క్లాస్ అప్‌గ్రేడేషన్ వర్తిస్తుంది. ఆటోమెటిక్ క్లాస్ అప్‌గ్రేడేషన్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్యాసింజర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి Next బటన్ పైన క్లిక్ చేయాలి.
అన్ని వివరాలు ఓసారి సరిచూసుకొని బుకింగ్ కొనసాగించాలి.
తర్వాత క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.

Read this: IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

IRCTC Tatkal Booking, IRCTC tatkal train tickets, irctc tatkal booking, irctc tatkal booking timings, tatkal ticket availability, tatkal booking online, irctc tatkal booking app, tatkal ticket booking software, tatkal booking timings 2019, tatkal booking charges, ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్, రైలు తత్కాల్ బుకింగ్, తత్కాల్ బుకింగ్ టైమింగ్స్, తత్కాల్ బుకింగ్ ఛార్జీలు


ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ విషయాలు గుర్తుంచుకోండి


తత్కాల్ ఇ-టికెట్‌లో ఒక పీఎన్ఆర్‌కు గరిష్టంగా నలుగురు ప్రయాణికుల్ని మాత్రమే అనుమతిస్తారు.
తత్కాల్ కోటాలో ఎలాంటి కన్సెషన్స్ వర్తించవు.
మీ ప్రయాణానికి తేదీ ఫిక్స్ చేసుకోకపోతే 'Flexible with Date' ఆప్షన్ ఎంచుకోవచ్చు.
సెకండ్ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం అదనంగా చెల్లించాలి.
మిగతా క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాలి.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC-ePayLater: డబ్బులు లేవా? అయినా ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు ఇలా...

IRCTC Rules: టికెట్ రీఫండ్ రిజెక్ట్ కావడానికి 10 కారణాలివే...

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...