IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ

IRCTC SriLanka-Ramayana Trails Tour Package | ఫ్లైట్ టికెట్లు, వీసా ఛార్జీలు, హోటల్‌లో అకామడేషన్, భోజన వసతి, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ 2020 జనవరి 19న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: November 4, 2019, 12:25 PM IST
IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ
IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రామాయణంపై ఆసక్తి ఉన్నవారికి, రామాయణ సంబంధిత ప్రాంతాలను చూడాలనుకునేవారికి గొప్ప శుభవార్త. శ్రీరామ భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్రత్యేకమైన ప్యాకేజీ రూపొందించింది. 'ఐఆర్‌సీటీసీ రామాయణ ట్రయల్ ప్యాకేజీ' బుక్ చేసుకున్నవారిని శ్రీలంకలో రామాయణానికి సంబంధం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. నెగోంబో, క్యాండీ, నువారా ఎలియా, కొలంబో లాంటి ప్రాంతాలను చూడొచ్చు. 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజీ ఇది. 'ఐఆర్‌సీటీసీ రామాయణ ట్రయల్ ప్యాకేజీ' ప్రారంభ ధర రూ.41,800. ఫ్లైట్ టికెట్లు, వీసా ఛార్జీలు, హోటల్‌లో అకామడేషన్, భోజన వసతి, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ 2020 జనవరి 19న ప్రారంభం కానుంది.

IRCTC SriLanka-Ramayana Trails: టూర్ ప్యాకేజీ వివరాలివే...


'ఐఆర్‌సీటీసీ రామాయణ ట్రయల్' టూర్ షెడ్యూల్ చూస్తే 2020 జనవరి 19న ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 01.50 గంటలకు కోల్‌కతాలో ఫ్లైట్ ఎక్కాలి. సాయంత్రం 05.00 గంటలకు కొలంబో చేరుకుంటారు. అక్కడ్నుంచి నెగోంబోకు తీసుకెళ్తారు. రాత్రి అక్కడే బస చేయాలి. జనవరి 20న మున్నేశ్వరమ్, మునావరి ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి క్యాండీకి తీసుకెళ్తారు. రాత్రి అక్కడే బస చేయాలి. జనవరి 21న ఉదయం నువారా ఏలియా ప్రాంతానికి తీసుకెళ్తారు. స్పైస్ గార్డెన్, రాంబోడా వాటర్ ఫాల్, హనుమాన్ ఆలయం, టీ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి నువారా ఏలియాలోనే హోటల్‌లో బస చేయాలి.




జనవరి 22న గాయత్రి పీఠం, సీతా అమ్మన్ ఆలయం, అశోక వాటిక, దివురుంపోలా ఆలయం (సీత అగ్నిపరీక్ష నిర్వహించిన స్థలం), గ్రెగోరీ లేక్ లాంటి ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఆరోజు కూడా నువారా ఏలియాలోనే బస ఉంటుంది. జనవరి 23న పిన్నావాలా మీదుగా కొలంబో ప్రయాణించాలి. పిన్నావాలా ఎలిఫెంట్ షోతో పాటు కొలంబోలో గాల్లే ఫేస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, ప్రెసిడెంట్ హౌజ్ సందర్శన ఉంటుంది. జనవరి 24న ఉదయం 08.25 గంటలకు కొలంబోలో ఫ్లైట్ ఎక్కితే 11.30 గంటలకు కోల్‌కతా చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IRCTC Dubai Tour: ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్... ఓన్లీ ఫర్ లేడీస్

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి హంపి టూర్ ప్యాకేజీ... వివరాలివే
First published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>