ఐఆర్‌సీటీసీ టూరిజం శ్రీరామాయణ యాత్రను (IRCTC Shri Ramayana Yatra) ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. జూన్ 21న ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. స్పెషల్ టూరిస్ట్ ట్రైన్‌లో 18 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. స్వదేశ్ దర్శన్ స్కీమ్‌లో (Swadesh Darshan Scheme) భాగంగా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించిన యాత్ర ఇది. టూరిస్టుల్ని థర్డ్ ఏసీ కోచ్‌లో తీసుకెళ్తారు. ఈ టూర్ ఢిల్లీలో ప్రారంభమై అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, నాసిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం మీదుగా చివరకు ఢిల్లీలో ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
Day 1: ఐఆర్‌సీటీసీ టూరిజం శ్రీరామాయణ యాత్ర మొదటి రోజు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
Day 2: రెండో రోజు అయోధ్య రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, సరయు ఘాట్ సందర్శించాలి. ఆ తర్వాత నందిగ్రామ్ బయల్దేరాలి. నందిగ్రామ్‌లోని భారత్ హనుమాన్ ఆలయం, భారత్ కుండ్ సందర్శన ఉంటుంది. సాయంత్రం సరయు హారతి సందర్శన ఉంటుంది. రాత్రికి అయోధ్య నుంచి బుక్సర్ బయల్దేరాలి.
Day 3: మూడో రోజు ఉదయం బుక్సర్ చేరుకుంటారు. బుక్సార్‌లోని రామ్ రేఖా ఘాట్, రామేశ్వర్ నాథ్ ఆలయం సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత జనక్‌పూర్ బయల్దేరాలి. రాత్రికి జనక్‌పూర్‌లో బస చేయాలి.
Day 4: నాలుగో రోజు సీతామర్హిలోని జానకి మందిర్, పునౌరా ధామ్, జనకపూర్‌లోని రామ్ జానకి ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వారణాసి బయల్దేరాలి.
Day 5: ఐదో రోజు వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం, గంగా హారతి సంర్శన ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
Day 6: ఆరో రోజు వారణాసిలో తుల్సీ మానస్ ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. రాత్రికి ప్రయాగ్‌రాజ్‌లో బస చేయాలి.
Day 7: ఏడో రోజు ఉదయం సంగం ప్రయాగ్‌లో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవాలి. భరద్వాజ ఆశ్రమం, గంగా యమున సంగం, హనుమాన్ ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శృంగవేర్పూర్, భరద్వాజ ఆశ్రమం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత చిత్రకూట్ బయల్దేరాలి.
Day 8: ఎనిమిదో రోజు చిత్రకూట్‌లో మందాకిని నదికి వెళ్లాలి. సతీ అనసూయ ఆశ్రమం, గుప్త గోదావరి, రామ్ ఘాట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత నాసిక్ బయల్దేరాలి.
Day 9: తొమ్మిదో రోజు నాసిక్ చేరుకుంటారు. రాత్రికి నాసిక్‌లో బస చేయాలి.
Day 10: పదో రోజు నాసిక్ త్రయంబకేశ్వర్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పంచవటి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత హోస్‌పేట్ బయల్దేరాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
Day 15: పదిహేనో రోజు కాంచీపురం చేరుకుంటారు. విష్ణు కంచి, శివ కంచి, కామాక్షి అమ్మన్ ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత భద్రాచలం బయల్దేరాలి.
Day 16: పదహారో రోజు భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలంలో శ్రీసీతారామ స్వామి ఆలయం, అంజనీ స్వామి ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.
Day 17: పదిహేడో రోజంతా ప్రయాణమే ఉంటుంది.
Day 18: పద్దెనిమిదో రోజు ఢిల్లీ సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం శ్రీరామాయణ యాత్ర ప్యాకేజీ ధర రూ.62,370. టూర్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం, స్టాండర్డ్ హోటళ్లలో ఏసీ గదుల్లో బస, శాకాహార భోజనం, నాన్ ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.