హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే
(image: Twitter / South Central Railway)

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే (image: Twitter / South Central Railway)

IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.

  తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో వెల్లడించింది.

  ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.

  IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు అదుర్స్ (Photos)

  భారతదేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునేవారి కోసం ఈ రైలును నడుపుతోంది ఐఆర్‌సీటీసీ. నవంబర్ 7న మొదలైన యాత్ర నవంబర్ 25న ముగుస్తుంది. 16 రాత్రులు, 17 రోజుల టూర్ ఇది. ఢిల్లీలో బయల్దేరిన రైలు మొదట అయోధ్యలో ఆగుతుంది. అక్కడ శ్రీ రామజన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయం సందర్శించొచ్చు. వీటితో పాటు నందిగ్రామ్‌లో భారత్ మందిర్ చూడొచ్చు. ఆ తర్వాత బీహార్‌లోని సీతామర్హి, జానక్‌పూర్‌లో సీత జన్మస్థలం అయిన రామ్ జానకి ఆళయం సందర్శించొచ్చు.

  IRCTC Shri Ramayana Yatra, IRCTC Shri Ramayana express, IRCTC Shri Ramayana tour, IRCTC Shri Ramayana Yatra booking, shri ramayana yatra express, shri ramayana yatra special tour train, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ టూర్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ టూర్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ టూరిజం

  ఆ తర్వాత రైలు వారణాసి బయల్దేరుతుంది. వారణాసి, ప్రయాగ్, శృంగ్వేర్‌పూర్, చిత్రకూట్ లాంటి ప్రాంతాలను రోడ్డుమార్గంలో సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు నాసిక్ బయల్దేరుతుంది. త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి ఆలయాన్ని సందర్శించొచ్చు. నాసిక్ తర్వాత హంపి, క్రిష్కింద పట్టణాలు సందర్శించవచ్చు. రామేశ్వరం సందర్శన తర్వాత రైలు భద్రాచలానికి వస్తుంది. ఆ తర్వాత రైలు ఢిల్లీ బయల్దేరుతుంది. మొత్తం 17 రోజుల టూర్ ఇది. పర్యాటకులు 7500 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది.

  IRCTC Kashmir Tour: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ

  కేంద్ర ప్రభుత్వం దేశీయ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రకటించిన దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ యాత్రను ప్రారంభించింది. సెకండ్ ఏసీ బెర్త్‌కు ఒకరికి రూ.82,950, ఫస్ట్ ఏసీ బెర్త్‌కు రూ.1,02,095 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఏసీ క్లాస్ ప్రయాణం, ఏసీ హోటళ్లలో బస, శాకాహార భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రైవెల్ ఇన్స్యూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు కవర్ అవుతాయి. ఈ టూర్‌లో పర్యాటకుల ఆరోగ్యం కోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోంది ఐఆర్‌సీటీసీ.

  IRCTC Shri Ramayana Yatra, IRCTC Shri Ramayana express, IRCTC Shri Ramayana tour, IRCTC Shri Ramayana Yatra booking, shri ramayana yatra express, shri ramayana yatra special tour train, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ టూర్, ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ టూర్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ టూరిజం

  ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ రైలులో ఉన్న అత్యాధునిక హంగులు, ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. లగ్జరీ రైలులో ఉండే హంగులన్నీ ఈ రైలులో చూడొచ్చు. ఈ డీలక్స్ లగ్జరీ రైలులో పర్యాటకులు భోజనం చేసేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్ ఉంది. ఇక టూరిస్టులకు కావాల్సినవి వండిపెట్టేందుకు రైలులోనే షెఫ్స్ సిద్ధంగా ఉంటారు. రైలు బెర్త్ చూస్తే హోటల్ గదిలా ఉంటుంది.

  ఈ రైలులో మోడర్న్ కిచెన్, సెన్సార్ బేస్డ్ వాష్‌రూమ్, రెండు డైనింగ్ రెస్టారెంట్స్, షవర్ క్యూబికల్స్, ఫుట్ మసాజర్ లాంటి ఏర్పాట్లు ఉన్నాయి. పర్యాటకుల భద్రత కోసం ప్రతీ కోచ్‌లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ప్రతీ బోగీలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నవంబర్ 16న మరో యాత్రను కూడా ప్రారంభించనుంది ఐఆర్‌సీటీసీ. శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-మదురై రైలు నవంబర్ 16న బయల్దేరుతుంది. 12 రాత్రులు, 13 రోజుల టూర్ ఇది. ఇక నవంబర్ 25న శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-శ్రీగంగానగర్ యాత్ర నవంబర్ 25న ప్రారంభం అవుతుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, Bhadrachalam, Indian Railway, Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways, Ramayana, Special Trains, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism, Tourist place, Train, Train tickets, Travel

  ఉత్తమ కథలు