హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం

IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం

IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Share Price | ఐఆర్‌సీటీసీ స్టాక్ స్టాక్ మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇన్వెస్టర్లకు ఐఆర్‌సీటీసీ షేర్ లాభాల వర్షం కురిపిస్తోంది. నాలుగు నెలల క్రితం రూ.1,00,000 పెట్టుబడి పెట్టినవారికి రూ.5,00,000 లాభం వచ్చింది.

స్టాక్ మార్కెట్... ఈ పేరు వింటే ఇందులో లాభాలు సంపాదించడం కన్నా నష్టపోయేవాళ్లే ఎక్కువ అన్నా కామెంట్స్ వినిపిస్తాయి. అలాగని ఇందులో అందరూ నష్టపోతున్నారా అని చూస్తే లాభాలు పొందేవారు కూడా కనిపిస్తారు. తెలివిగా ఇన్వెస్ట్ చేసి కోట్లల్లో సంపాదిస్తున్నవాళ్లున్నారు. ఇలా తక్కువ టైమ్‌లో లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటే మంచి స్టాక్స్ పట్టుకోవాలి. సరైన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లక్షలు సంపాదించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో అలాంటి ఓ స్టాక్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. అదే ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC షేర్. మొదట్లో ఇందులో రూ.1,00,000 పెట్టుబడి పెట్టినవారికి కేవలం నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం వచ్చిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే.

గతేడాది ఐఆర్‌సీటీసీ ఐపీఓ ప్రకటించినప్పుడు ఇష్యూ ధర రూ.320. లిస్టింగ్ నుంచే ఐఆర్‌సీటీసీ షేర్ రికార్డులు సృష్టిస్తోంది. 2019 అక్టోబర్ 14న ఐఆర్‌సీటీసీ షేర్ లిస్టైంది. ఇష్యూ ప్రైస్‌కు 179 శాతం ఎక్కువగా స్టాక్ మార్కెట్‌లో లిస్టైంది. అంటే రూ.320 షేర్ ఏకంగా రూ.644 ధరతో లిస్టై రికార్డులు సృష్టించింది. ఇక అక్కడ్నుంచి ఐఆర్‌సీటీసీ షేర్ ధర పరుగు ఆపలేదు. వరుసగా పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి 19న ఒక్కరోజే ఐఆర్‌సీటీసీ షేర్ ధర 9.6% పెరిగి రూ.1798 ధరకు చేరుకుంది. ఫిబ్రవరి 20న షేర్ ధర 4.37 శాతం పెరిగి రూ.1,912 ధర దగ్గర ఆగింది. నాలుగు నెలల క్రితం రూ.320 ఇష్యూ ప్రైస్‌తో మొదలై ఇప్పుడు రూ.2,000 మార్క్ వైపు పరుగులు తీస్తోంది ఐఆర్‌సీటీసీ షేర్ ధర.

ఐఆర్‌సీటీసీ ఐపీఓ ద్వారా ఇన్వెస్ట్ చేసి షేర్లు అమ్ముకోకుండా ఉన్నవారికి లాభాల వర్షం కురుస్తోంది. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీ ఐపీఓలో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి 312 షేర్లు వచ్చాయి. ఫిబ్రవరి 20 నాటి ఐఆర్‌సీటీసీ షేర్ ధర ప్రకారం 312 షేర్ల విలువ ఎంతో తెలుసా? రూ.5,96,544. అంటే సుమారు రూ.6,00,000. అంటే 2019 అక్టోబర్‌లో ఐఆర్‌సీటీసీ షేర్ల ద్వారా రూ.1,00,000 పెట్టినవారికి లాభాల రూపంలో రూ.5,00,000 వచ్చినట్టే. అందుకే ఐఆర్‌సీటీసీ స్టాక్ ఇప్పుడు షేర్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఐఆర్‌సీటీసీ వారణాసి-ఇండోర్ మధ్య కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఐఆర్‌సీటీసీ షేర్ ధర ఇంతలా పెరగడానికి కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Shri Ramayana Express: రామ భక్తులకు శుభవార్త... మార్చి 28 నుంచి శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్

SIM Swap: మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసే మోసాన్ని అడ్డుకోండి ఇలా

SBI Card: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ రూల్స్‌తో మీ కార్డ్ సేఫ్‌

First published:

Tags: Indian Railway, Indian Railways, Investment Plans, Irctc, Personal Finance, Railways, Share price, Stock Market

ఉత్తమ కథలు