హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC SBI Credit Card: రైల్వే ప్రయాణికులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే

IRCTC SBI Credit Card: రైల్వే ప్రయాణికులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే

IRCTC SBI Credit Card: రైల్వే ప్రయాణికులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే
(image: IRCTC)

IRCTC SBI Credit Card: రైల్వే ప్రయాణికులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే (image: IRCTC)

IRCTC SBI Credit Card | రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్స్ బుక్ (Train Ticket Booking) చేసి రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో ట్రైన్ టికెట్ బుక్ చేసేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది.

  మీరు తరచూ రైళ్లల్లో ప్రయాణిస్తుంటారా? మీ ఉద్యోగంలో భాగంగా ఎక్కువగా ట్రైన్ జర్నీ చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రైల్వే ప్రయాణికులకు అదనపు బెనిఫిట్స్ అందించేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కలిసి ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ (Credit Card) అందిస్తున్నాయి. ప్రీమియర్, ప్లాటినమ్, రూపే పేర్లతో ఈ క్రెడిట్ కార్డ్స్ వేర్వేరుగా ఉన్నాయి. అయితే తక్కువ యాన్యువల్ ఫీజ్‌తో రూపే ప్లాట్‌ఫామ్‌పై ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డును గతేడాది లాంఛ్ చేశాయి ఈ రెండు సంస్థలు. 2021 మార్చి 31 వరకు యాన్యువల్ ఫీజు లేకుండానే ఈ క్రెడిట్ కార్డ్‌ను ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రైల్వే ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు తీసుకోవాలంటే రూ.500 + ట్యాక్సెస్ కలిపి యాన్యువల్ ఫీజ్ చెల్లించాలి. ప్రతీ ఏటా రెన్యువల్ ఫీజు రూ.300 చెల్లించాలి. ప్రీమియర్, ప్లాటినమ్ కార్డులతో పోలిస్తే రూపే క్రెడిట్ కార్డ్ ఛార్జీలు తక్కువ. ఈ కార్డు పొందినవారికి వెల్‌కమ్ గిఫ్ట్ లభిస్తుంది. కార్డు తీసుకున్న 45 రోజుల్లో రూ.500 పైన సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే 350 యాక్టివేషన్ బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఫ్యూయెల్, క్యాష్‌కు ఈ రివార్డ్ పాయింట్స్ వర్తించవు.

  LIC Alert: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

  ఇక రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేస్తే 10 శాతం వ్యాల్యూబ్యాక్ రివార్డ్ పాయింట్స్ రూపంలో లభిస్తాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్ టికెట్లకు వ్యాల్యూబ్యాక్ వర్తిస్తుంది. రైలు టికెట్ బుకింగ్స్‌పై 1 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీల మినహాయింపు లభిస్తుంది. దీంతో పాటు ప్రతీ రూ.125 ఖర్చు చేస్తే రూ.1 విలువైన రివార్డ్ పాయింట్ లభిస్తుంది. ఇక పెట్రోల్ పంపుల్లో 1 శాతం ఫ్యూయెల్ ఛార్జీల మినహాయింపు పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ బోహోల్డర్లు 18 ఏళ్లు దాటిన కుటుంబ సభ్యుల పేరు మీద యాడ్ ఆన్ కార్డ్ తీసుకోవచ్చు.

  Earn Rs 10 Crore: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి రూ.10 కోట్లు కావాలంటే ఇలా పొదుపు చేయండి

  ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే లాంజ్ ప్రోగ్రామ్ కూడా వర్తిస్తుంది. రైల్వే లాంజ్‌లో ఏడాదిలో నాలుగు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఈ యాక్సెస్ పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో భారతదేశంలో ఉన్న 43,000 పైగా ఏటీఎంలతో పాటు 190 దేశాల్లో ఉన్న 20 లక్షలకు పైగా ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేస్తే వడ్డీ చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  ఉత్తమ కథలు