IRCTC RESUMING E CATERING SERVICES AT 62 RAILWAY STATIONS INCLUDING VIJAYAWADA SS GH
IRCTC: విజయవాడ సహా 62 రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు
IRCTC: విజయవాడ సహా 62 రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC | ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీసెస్ మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. విజయవాడ సహా దేశంలోని 62 రైల్వే స్టేషన్లలో ఇ-కేటరింగ్ ప్రారంభిస్తోంది ఐఆర్సీటీసీ.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది ఐఆర్సీటీసీ. కరోనా లాక్డౌన్ కారణంగా సుదీర్ఖకాలం పాటు నిలిచిపోయిన ఇ-క్యాటరింగ్ సేవలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇ-కేటరింగ్ సేవలను ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఫిబ్రవరి నుంచి ఈ సేవలను దశల వారిగా అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టం చేసింది. మొదటి దశలో ఎంపిక చేసిన 62 రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత క్రమంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లకు ఈ సేవలను విస్తరించనున్నారు. కాగా, దేశంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో రైల్వే శాఖ దశలవారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నప్పటికీ ఐఆర్సీటీసీ మాత్రం ఈ–క్యాటరింగ్ సేవలను పునరుద్ధరించలేదు. అయితే, కరోనా వైరస్ ఆంక్షల్ని సడలిస్తూ ఇటీవల ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేయడంతో ఇ-కేటరింగ్ సేవలను మళ్లీ ప్రారంభించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. కాగా, ప్రయాణికులు తాము కోరుకున్న స్టేషన్లలో కోరుకున్న ఆహారాన్ని సీట్ల వద్దకే అందించే క్యాటరింగ్ సేవలను ఐఆర్సీటీసీ 2014లో ప్రారంభించింది. రుచి, శుభ్రత కలిగిన ఆహారాన్ని తమ వద్దకే సులభంగా తెప్పించుకునే అవకాశం ఉండటంతో ఈ–క్యాటరింగ్ సేవలకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కోవిడ్–19కు ముందు రోజుకు 20 వేల ఆర్డర్లు వచ్చేవని ఐఆర్సీటీసీ తెలిపింది. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఈ సేవలను మార్చి 22న నిలిపివేశారు.
"మొదటి దశలో భాగంగా ఫిబ్రవరి 1న ఎంపిక చేసిన 62 స్టేషన్లలో ఇ-క్యాటరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు ఈ–క్యాటరింగ్ సర్వీసులను అందించనున్నాం" అని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, మొదటి దశలో మొత్తం 62 స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమవ్వనుండగా... ఈ జాబితాలో న్యూఢిల్లీ, హౌరా, పాట్నా, విజయవాడ, ఎర్నాకులం స్టేషన్లు ఉన్నాయి. ప్రయాణికులు ఐఆర్సీటీసీకి చెందిన ఇ-క్యాటరింగ్ వెబ్సైట్ లేదా 'ఫుడ్ ఆన్ ట్రాక్' యాప్ ద్వారా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ క్రమంలో ప్రయాణికులు వారి సీటు నంబర్, పిఎన్ఆర్ నంబర్, రైలు పేరు వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, రైల్వే శాఖ ఈ–క్యాటరింగ్ సేవలను తిరిగి ప్రారంభిస్తుండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.