IRCTC PNR STATUS CHECK YOUR TRAIN TICKET STATUS ON WHATSAPP FOLLOW THESE SIMPLE STEPS SS
IRCTC PNR Status: మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
IRCTC PNR Status: మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC PNR Status | ఒకప్పుడు రైలు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలుసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో పీఎన్ఆర్ స్టేటస్ చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.
మీరు ఎక్కడికైనా రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? మీ టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలుసుకునేందుకు పదేపదే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేసి పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తున్నారా? మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. Railofy పేరుతో ప్రైవేట్ ప్లాట్‌ఫామ్ ఈ సేవల్ని అందిస్తోంది. వాళ్ల వాట్సప్ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకొని మీ పీఎన్ఆర్ నెంబర్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం పీఎన్ఆర్ స్టేటస్ మాత్రమే కాదు లైవ్ ట్రైన్ స్టేటస్, అంతకుముందు రైల్వే స్టేషన్, రాబోయే రైల్వే స్టేషన్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయాణికులు 139 నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ అవసరం లేకుండా మీ వాట్సప్‌లోనే ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మరి మీరేం చేయాలో తెలుసుకోండి.
ముందుగా మీ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి వాట్సప్ యాప్ అప్డేట్ చేయండి. ఆ తర్వాత Railofy సంస్థకు చెందిన ట్రైన్ ఎంక్వైరీ నెంబర్ 9881193322 మీ ఫోన్లో సేవ్ చేయండి. ఆ తర్వాత వాట్సప్ యాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ ఓసారి రీఫ్రెష్ చేయండి. కాంటాక్ట్స్ లిస్ట్‌లో 9881193322 నెంబర్ కనిపిస్తుంది. ఛాట్ విండో ఓపెన్ చేసి మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. మీ పీఎన్ఆర్ స్టేటస్ తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ పీఎన్ఆర్ స్టేటస్‌కి సంబంధించిన అప్డేట్స్ మీ వాట్సప్‌లోనే వస్తాయి.
ముంబైకి చెందిన స్టార్టప్ Railofy వినూత్నమైన సేవల్ని అందిస్తోంది. ఒకవేళ మీ రైలు టికెట్ కన్ఫామ్ కాకపోతే ఫ్లైట్‌లో వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం రైల్వే ప్రయాణికులు రూ.50 నుంచి రూ.500 వరకు చెల్లించి వెయిట్‌లిస్ట్ అండ్ ఆర్ఏసీ ప్రొటెక్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న, ఆర్ఏసీలో ఉన్నా అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ అందిస్తుంది ఈ సంస్థ.