కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో శ్రీవారి భక్తులు తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది. గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టూర్ ప్యాకేజీని నిలిపివేసింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇప్పుడు కోవిడ్ 19 ప్రభావం తగ్గడంతో ఈ ప్యాకేజీని మళ్లీ అందిస్తోంది. ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులు తిరుమల, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం కూడా కవర్ అవుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
IRCTC Ticket Booking: ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసే రైల్వే ప్రయాణికులకు శుభవార్త
IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవా టూర్... ప్యాకేజీ వివరాలివే
ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,270. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,010. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,750 చెల్లించాలి. ఇది 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజు వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. అంటే తిరుపతి వచ్చే భక్తులు తిరుమలతో పాటు చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ https://www.irctctourism.com/ లో బుక్ చేయొచ్చు. ఇదే వెబ్సైట్లో మరిన్ని వివరాలు ఉంటాయి.
IRCTC Hyderabad Tour: ఐదు వందలకే హైదరాబాద్ టూర్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Tirupathi Tour: ఐఆర్సీటీసీ తిరుమల ప్యాకేజీ రూ.990 మాత్రమే... శ్రీవారి దర్శనం కూడా
ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. భక్తులు తిరుపతి చేరుకున్నాక ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. ఐఆర్సీటీసీ సిబ్బంది భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలు సందర్శించొచ్చు. ఆ తర్వాత భక్తులు తిరుపతిలో సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం చేయాలి. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి భక్తులు తిరుపతిలోనే బస చేయాలి.
రెండో రోజు ఉదయం 9.30 గంటలకు తిరుమల బయల్దేరాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటలోగా దర్శనం పూర్తి చేసుకొని 2 గంటల వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ తర్వాత తిరుపతి బయల్దేరాలి. సమయం ఉంటే గోవిందరాజ స్వామి ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రానికి భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Tourism, Tourist place, Travel