IRCTC OPERATING PANCHA DEVALAYAM 2 DAY TOUR PACKAGE FROM TIRUPATI COVERS SPECIAL ENTRY DARSHAN AT TIRUMALA AND KANIPAKAM SRINIVASA MANGAPURAM SREE KALAHASTHI TIRUCHANURU SS
IRCTC Tirupat Tour: తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
IRCTC Tirupat Tour: తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Tirupat Tour | తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతి లోకల్ టూర్ (Tirupati Local Tour) వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం సహా తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సమీపంలో ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారు ఉంటారు. ఇంకా సమయం ఉంటే తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. రెండుమూడు రోజులు తిరుపతిటూర్ (Tirupati Tour) ప్లాన్ చేసుకునేవారు తప్పనిసరిగా చుట్టుపక్కన ఉన్న ఆలయాలను కూడా సందర్శించడం మామూలే. మరి మీరు కూడా తిరుపతికి రెండు రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే. పంచ దేవాలయం పేరుతో ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Special Entry Darshan) ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కూడా కవర్ అవుతాయి.
ఐఆర్సీటీసీ పంచ దేవాలయం 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే దూరప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే భక్తుల కోసం రూపొందించిన ప్యాకేజీ. తిరుపతికి చేరుకున్న తర్వాత ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ మొదలవుతుంది. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకొని ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.
ఐఆర్సీటీసీ పంచ దేవాలయం టూర్లో భాగంగా ఐఆర్సీటీసీ సిబ్బంది మొదటి రోజు ఉదయం 7 గంటలకు భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుంటారు. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శన ఉంటుంది.ఆ తర్వాత శ్రీకాళహస్తి తీసుకెళ్తారు. రాత్రికి భక్తులు తిరుపతిలోనే బస చేయాలి.
ఇక రెండో రోజు ఉదయం 8.00 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. తిరుమలలో దర్శనం పూర్తైన తర్వాత తిరుచూనూర్ పద్మావతి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత భక్తుల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. గ్రూప్ టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఐఆర్సీటీసీ పంచ దేవాలయం ప్యాకేజీ ధరలు చూస్తే ముగ్గురి లోపు బుక్ చేస్తే ఒకరికి సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,070, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,580, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,170. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేస్తే ఒకరికి డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5170, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4940. ఏడుగురి నుంచి పది మంది కలిపి బుక్ చేస్తే ఒకరికి డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4580, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4350. ప్యాకేజీలో తిరుపతిలో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.