పర్యాటకుల్ని అతి తక్కువ ధరకే దేశంలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు భారతీయ రైల్వే భారత్ దర్శన్ పేరుతో ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని వేర్వేరు రూట్లలో ఈ రైళ్లు నడుస్తున్నాయి. అందులో భాగంగా దక్షిణ భారతదేశ పర్యాటకుల్ని మధ్యప్రదేశ్‌లోని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేందుకు భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ నడుపుతోంది. గ్వాలియర్, ఝాన్సీ, ఖజురహో, విదిశ, సాంచీ, భోపాల్ ప్రాంతాలు సందర్శించొచ్చు. 2021 ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఈ టూర్ కొనసాగుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ ధర రూ.10,200 మాత్రమే. ప్యాకేజీలో రైలు ప్రయాణం, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
Tata Sky: ఈ కారు గెలుచుకోవాలంటే టాటా స్కై రీఛార్జ్ చేస్తే చాలు... కాంటెస్ట్‌లో పాల్గొనండి ఇలా
భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు ఫిబ్రవరి 18న మధురైలో ప్రారంభం అవుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు, విజయవాడ జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఫిబ్రవరి 19న ఆగుతుంది. ఫిబ్రవరి 20 సాయంత్రం గ్వాలియర్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి 21న గ్వాలియర్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. గ్వాలియర్ ఫోర్ట్, మన్ మందిర్ ప్యాలెస్ సందర్శించొచ్చు. రాత్రికి ఓర్ఛా చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి 22న రాణీ మహల్, ఝాన్సీ ఫోర్ట్, ఓర్ఛా ఆలయం, ఓర్ఛా ఫోర్ట్ సందర్శించొచ్చు. రాత్రికి అక్కడి నుంచి బయల్దేరాలి. ఫిబ్రవరి 23 ఉదయం ఖజురహో చేరుకుంటారు. రోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి అక్కడి నుంచి బయల్దేరాలి.
IRCTC e-catering: ఫిబ్రవరి 1 నుంచి ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభం... ఫుడ్ ఆర్డర్ చేయండిలా
Indian Railways: రైలు ప్రయాణికుల ప్రైవసీ కోసం ప్రత్యేక కిటికీలు... ఎలా ఉంటాయంటే
Explore the 'Heart of India', #MadhyaPradesh & visit the most iconic landmarks of #Gwalior, #Khajuraho, #Jhansi, #Vidisha, #Sanchi & #Bhopal with #IRCTCTourism's 'Jewels of Madhya Pradesh' tour package. Ideal for a family holiday, book it on https://t.co/r4jLV9R6de #DekhoApnaDesh
— IRCTC (@IRCTCofficial) January 20, 2021
ఫిబ్రవరి 24 విదిశ చేరుకుంటారు. సాంచీ స్థూపం, హలాలీ డ్యామ్ సందర్శించిన తర్వాత భోపాల్ బయల్దేరతారు. రాత్రి భోపాల్‌లో బస చేయాలి. ఫిబ్రవరి 25న భీమ్‌భక్త గుహలు, భోజ్‌పూర్ శివాలయం సదర్శించాలి. ఫిబ్రవరి 25న హబీబ్‌గంజ్‌లో బయల్దేరుతుంది. ఫిబ్రవరి 26న వరంగల్, విజయవాడ జంక్షన్, నెల్లూరులో రైలు ఆగుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 27న మధురై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ఉండటంతో ప్రయాణికులు కోవిడ్ 19 గైడ్‌లైన్స్ పాటించాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్కులు ధరించాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలి. శానిటైజర్ ఉపయోగించాలి. ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.