హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour | హైదరాబాద్ నుంచి షిరిడీ టూర్ (Hyderabad to Shirdi) వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం నాలుగు రోజుల టూర్ ప్యాకేజీని రూ.5,000 లోపే అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

షిరిడీ వెళ్లాలనుకునే సాయి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిరిడీ (Hyderabad to Shirdi) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి శివం పేరుతో ఆపరేట్ చేస్తున్న షిరిడీ టూర్ ప్యాకేజీలో (Shirdi Tour Package) షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్ కవర్ అవుతుంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకుల్ని రైలులో తీసుకెళ్లి షిరిడీతో పాటు నాసిక్ చూపించనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత, టూర్ ఎలా సాగుతుంది అన్న వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ వివరాలివే...

ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటిరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి షిరిడీకి బయల్దేరాలి. ఆ తర్వాత షిరిడీలో సాయిబాబా ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాలి.

IRCTC Tour: ఖజురహో శిల్పాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

మూడో రోజు ఉదయం నాసిక్ బయల్దేరాలి. త్రయంబకేశ్వర్, పంచవటి సందర్శన ఉంటుంది. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. నాలుగో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,940 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,890, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,630 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

New Rules: అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి... వెంటనే ఇలా చేయండి

ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతి , వారణాసి, కేరళ, ఊటీ, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Shirdi

ఉత్తమ కథలు