IRCTC: ప్రయాణికులకు షాక్... ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్‌కు అంతరాయం

IRCTC | మెయింటనెన్స్ గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని, సరిగ్గా టికెట్లు బుక్ చేసే సమయంలో ఎర్రర్ మెసేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో కంప్లైంట్ చేశారు ప్రయాణికులు.

news18-telugu
Updated: May 16, 2019, 3:05 PM IST
IRCTC: ప్రయాణికులకు షాక్... ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్‌కు అంతరాయం
IRCTC: ప్రయాణికులకు షాక్... ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్‌కు అంతరాయం
news18-telugu
Updated: May 16, 2019, 3:05 PM IST
గురువారం ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్‌లో సమస్యలు తలెత్తాయి. యాప్‌లో, వెబ్‌సైట్‌లో తత్కాల్‌ టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నించిన వారికి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. దీంతో తత్కాల్ టికెట్ల కోసం ప్రయత్నించిన వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికులు ట్విట్టర్‌లో ఐఆర్‌సీటీసీకి, ఇండియన్ రైల్వేస్‌కు ఫిర్యాదులు చేశారు. సైట్, యాప్ మెయింటనెన్స్ చేస్తున్నట్టు మెసేజ్ రావడంతో ప్రయాణికులు మండిపడ్డారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో సైట్, యాప్ మెయింటనెన్స్ చేయడమేంటని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.





మెయింటనెన్స్ గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని, సరిగ్గా టికెట్లు బుక్ చేసే సమయంలో ఎర్రర్ మెసేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో కంప్లైంట్ చేశారు. ఐఆర్‌సీటీసీ తీరు వల్ల మే 19 జరగబోయే చివరి విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయామని కొందరు మండిపడ్డారు. సమ్మర్ వెకేషన్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువగా తత్కాల్ సదుపాయం ఉపయోగించుకుంటున్నారని, టికెట్లు దొరక్కపోవడం వల్ల ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయిందని ట్వీట్స్ చేశారు. ఇంకొందరైతే బుల్లెట్ ట్రైన్ల సంగతి తర్వాత, ముందు వెబ్‌సైట్ క్రాష్ కాకుండా ఐటీ సదుపాయాలను మెరుగుపర్చాలని సలహా ఇచ్చారు.





ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు ఏసీ క్లాసెస్‌, 11 గంటలకు నాన్-ఏసీ క్లాసెస్ తత్కాల్ టికెట్లను బుకింగ్ ఓపెన్ చేస్తుంది ఇండియన్ రైల్వే. సరిగ్గా అదే సమయంలో సైట్, యాప్ మెయింటనెన్స్ చేయడంపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి

PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా

IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...