IRCTC Work From Hotel: హిమాలయాలకు దగ్గరగా ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ

IRCTC Work From Hotel: హిమాలయాలకు దగ్గరగా ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ (image: IRCTC Tourism)

IRCTC Work From Hotel | ఐఆర్‌సీటీసీ మరో వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వరుసగా వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బోర్ కొట్టినవారి కోసం ప్రత్యేకంగా ఈ టూర్ ప్యాకేజీలను రూపొందిస్తోంది. దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాల్లో ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్‌గా పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్‌లో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీని ప్రకటించింది. 'ఎంజాయ్ హాలిడేస్ వైల్ ఎట్ వర్క్ ఇన్ దువార్స్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. నాలుగు రాత్రులు, ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. దువార్స్‌కు చేరుకున్న తర్వాతే ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. అంటే దువార్స్‌కు చేరుకోవడానికి రవాణా సదుపాయాలేవీ ఐఆర్‌సీటీసీ తరఫున ఉండవు.

    IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే

    వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? Work From Hotel ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ


    ఐఆర్‌సీటీసీ 'ఎంజాయ్ హాలిడేస్ వైల్ ఎట్ వర్క్ ఇన్ దువార్స్' ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి అరణ్య గొరుమర జంగిల్ రిసార్ట్ లేదా అలాంటి హోటల్‌లో బస ఏర్పాట్లు ఉంటాయి. రిసార్ట్‌కు చేరుకున్న తర్వాత వెల్‌కమ్ డ్రింక్ ఉంటుంది. నాలుగు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. రోజూ రెండు సార్లు టీ లేదా కాఫీ ఇస్తారు. కాంప్లిమెంటరీ వైఫై సదుపాయం ఉంటుంది. వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. హోటల్ గదులను డిస్‌ ఇన్ఫెక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది.

    Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

    SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక

    ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9,345. ఇది డబుల్ ఆక్యుపెన్సీ ధర. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,445. ఇవి స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు. ప్రీమియం ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ప్రీమియం ప్యాకేజీ డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,005 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19,770. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: