Home /News /business /

IRCTC OFFERS WORK FROM HOTEL PACKAGE AT PURI KNOW ALL DETAILS SS

IRCTC Work From Hotel: సరదాగా బీచ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటారా? ఈ ప్యాకేజీ మీకోసమే

IRCTC Work From Hotel: సరదాగా బీచ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటారా? ఈ ప్యాకేజీ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Work From Hotel: సరదాగా బీచ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటారా? ఈ ప్యాకేజీ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Work From Hotel | ఐఆర్‌సీటీసీ మరో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ ప్రకటించింది. పూరీలో బీచ్‌కు దగ్గర్లోని హోటల్‌లో బస కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

    ఐఆర్‌సీటీసీ వినూత్నమైన ప్యాకేజీలను అందిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లోని ప్రముఖ హోటల్స్‌కి వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పూరీలో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 'వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ పూరీ' పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీ జూన్ 5 నుంచి ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆర్‌సీటీసీ 'వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ పూరీ' ప్యాకేజీ టూరిస్టులు పూరీకి చేరుకున్న తర్వాత ప్రారంభం అవుతుంది. బీచ్‌కు సమీపంలో ఉన్న తోషాలీ సాండ్స్ రిసార్ట్ లేదా తోషాలీ సాండ్స్ నేచర్ ఎస్కేప్ హోటల్‌లో బస ఏర్పాట్లు ఉంటాయి.

    IRCTC: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఐఆర్‌సీటీసీ నేచురోపతి ప్యాకేజీ

    IRCTC Work From Hotel: హిమాలయాలకు దగ్గరగా ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ

    హోటల్‌కు చేరుకున్న తర్వాత వెల్‌కమ్ డ్రింక్ ఇస్తారు. మూడు రాత్రులు హోటల్‌లో బస చేయొచ్చు. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. రోజూ రెండుసార్లు టీ లేదా కాఫీ ఇస్తారు. కాంప్లిమెంటరీ వైఫై సదుపాయం కూడా ఉంది. వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ సదుపాయం, పర్యాటకులకు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కూడా ఉన్నాయి.ఐఆర్‌సీటీసీ 'వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ పూరీ' ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14,375. ఇది డబుల్ ఆక్యుపెన్సీ ధర. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.11,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.21,254 చెల్లించాలి. ఇవన్నీ మూడు రోజులకు చెల్లించాల్సిన ధరలు. దీంతో పాటు 5 రాత్రులు, 7 రాత్రులు, 10 రాత్రులు, 12 రాత్రులు, 15 రాత్రులకు వేర్వేరు ప్యాకేజీ ధరలున్నాయి.

    IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే

    SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే


    దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇప్పటికే శాంతినికేతన్, కేరళ, దువార్స్ లాంటి ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏడాదికి పైగానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడుతోంది. అందుకే అలాంటివారు సేదతీరేందుకు ఈ ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ. కొత్త ప్రదేశంలో సేదతీరుతూ ఉద్యోగులు తమ విధులు నిర్వహించొచ్చు. అయితే ఈ ప్యాకేజీలో సైట్ సీయింగ్ లాంటివి ఉండవు. కేవలం హోటల్‌లో ఉంటూ విధులు నిర్వహించొచ్చు. హోటల్ పరిసర ప్రాంతాల్లో సేదతీరొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Irctc, IRCTC Tourism, Work From Home

    తదుపరి వార్తలు