IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే

IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Work from Hotel | వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు రిలాక్స్ అయ్యేందుకు వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను వరుసగా ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. లేటెస్ట్‌గా ప్రకటించిన శాంతినికేతన్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి బోర్ కొట్టిందా? రొటీన్ లైఫ్ విసుగు వచ్చిందా? కాస్త మార్పు కోరుకుంటున్నారా? మీలాంటివారి కోసం వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. దేశంలోని ప్రముఖ పర్యాట ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా పశ్ఛిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీని ప్రకటించింది. ఇది 3 రాత్రులు, 4 రోజుల ప్యాకేజీ. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,710. ఇది డబుల్ ఆక్యుపెన్సీ ధర. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,115 చెల్లించాలి. 2021 జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    SBI ATM PIN: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పిన్ గుర్తులేదా? కొత్త పిన్ ఇలా క్రియేట్ చేయండి

    LIC New Jeevan Shanti Policy: ఈ పాలసీలో ప్రీమియం ఒక్కసారి కడితే చాలు... ప్రతీ నెలా డబ్బులు పొందొచ్చు

    IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ శాంతినికేతన్ ప్యాకేజీ వివరాలు ఇవే...


    ఐఆర్‌సీటీసీ శాంతినికేతన్ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి క్రీక్ బొటిక్ రిసార్ట్ లేదా అలాంటి హోటల్‌లో బస కల్పిస్తారు. మూడు రాత్రులు, నాలుగు రోజులు అక్కడే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. పర్యాటకులు హోటల్‌కు చేరుకున్న తర్వాత వెల్‌కమ్ డ్రింక్ ఉంటుంది. వారికి మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. రోజూ రెండుసార్లు టీ లేదా కాఫీ అందిస్తారు. కాంప్లిమెంటరీ వైఫై సదుపాయం ఉంటుంది. హోటల్ గదులను ముందే డిస్‌ఇన్ఫెక్ట్ చేస్తారు. వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుంది.

    EPF Account: రెండు పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోండి

    LIC Bima Jyoti: ఈ పాలసీలో ప్రీమియం ఎంత చెల్లిస్తే అంతకు డబుల్ బెనిఫిట్


    ఈ ప్యాకేజీలో లాండ్రీ, డ్రింక్స్ లాంటి సదుపాయాలు ఉండవు. వీటికి పర్యాటకులు సొంతగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పర్యాటకులు హోటల్‌కు చేరుకున్న తర్వాతే ప్యాకేజీ మొదలవుతుంది. హోటల్‌కు చేరుకోవడానికి ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండవు. ఈ ప్యాకేజీ బుక్ చేసేముందు ఐఆర్‌సీటీసీ ప్రతినిధికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

    ఇక ఇప్పటికే ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే కేరళలోని మున్నార్, అలెప్పీ, వాయనాడ్, తెక్కడి, కొచ్చిన్, కుమారకోమ్, కోవలం లాంటి ప్రాంతాల్లోని హోటళ్లల్లో ఈ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.
    Published by:Santhosh Kumar S
    First published: