IRCTC Vizag Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్ టూర్ ప్యాకేజీ

IRCTC Vizag Retreat Package | మీరు వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? విశాఖపట్నం వచ్చే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: January 29, 2020, 3:27 PM IST
IRCTC Vizag Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్ టూర్ ప్యాకేజీ
IRCTC Vizag Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విశాఖపట్నం వెళ్లాలనుకునే టూరిస్టులకు శుభవార్త. పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. విశాఖపట్నానికి వచ్చే పర్యాటకుల కోసం రూపొందించిన ప్యాకేజీ ఇది. పర్యాటకులు విశాఖపట్నం చేరుకున్నాక టూరిస్ట్ స్పాట్స్ చూసేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం, అరకు, సింహాచలం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2020 జనవరి 1 నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 2020 మార్చి 29 వరకు బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6565, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9105, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.16715. ప్యాకేజీలో 2 రాత్రులు విశాఖపట్నంలో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి.

IRCTC Vizag Retreat Package: ఐఆర్‌సీటీసీ వైజాగ్ రీట్రీట్ ప్యాకేజీ వివరాలివే


ఐఆర్‌సీటీసీ వైజాగ్ రీట్రీట్ ప్యాకేజీ ప్రతీ రోజూ ఉంటుంది. మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి. రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేసే ముందు ఈ రూల్స్ మర్చిపోవద్దు



IRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర... తక్కువ ధరకే ప్యాకేజీ

IRCTC Dubai Tour: దుబాయ్ టూర్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... మహిళలకు మాత్రమే ఛాన్స్
First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు