IRCTC Vizag Tour: ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్-సింహాచలం టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Vizag Bliss Tour Package | విశాఖపట్నం వెళ్లే పర్యాటకులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 4, 2020, 4:45 PM IST
IRCTC Vizag Tour: ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్-సింహాచలం టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC Vizag Tour: ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్-సింహాచలం టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వైజాగ్ వచ్చే టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది ప్రకటించింది. అరకు టూర్, వైజాగ్ రీట్రీట్, వైజాగ్ బ్లిస్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. 1 రాత్రి, 2 రోజుల వైజాగ్ బ్లిస్ ప్యాకేజీలో విశాఖపట్నం, సింహాచలం ప్రాంతాలకు కవర్ అవుతాయి. 2020 జనవరి 1న ప్రారంభమైన ఈ ప్యాకేజీ 2020 మార్చి 29 వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3265. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీ రూ.4465, సింగిల్ ఆక్యుపెన్సీ రూ.8050. ప్యాకేజీలో ఒక రాత్రి విశాఖపట్నంలో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి.

IRCTC Vizag Bliss: ఐఆర్‌సీటీసీ వైజాగ్ టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ వైజాగ్ బ్లిస్ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో మొదలవుతుంది. టూరిస్టులను పికప్ చేసుకున్న తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలో బస చేయాలి. మరుసటి రోజు ఉదయం సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. సింహాచలంలో దర్శనం తర్వాత పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైజాగ్ రీట్రీట్ ప్యాకేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



ఇవి కూడా చదవండి:

IRCTC Tour: విజయవాడ నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ప్యాకేజీ వివరాలివేIRCTC Dubai Tour: దుబాయ్ టూర్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... మహిళలకు మాత్రమే ఛాన్స్

IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్... 'వాలెంటైన్స్ డే టూర్' తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు