IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే

IRCTC Venkatadri with Sreepuram Tour Package | థర్డ్ ఏసీ లేదా స్లీపర్ కేటగిరీలో ప్రయాణం, ఏసీ అకామడేషన్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

news18-telugu
Updated: November 11, 2019, 6:02 PM IST
IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే
IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే (image: TTD)
  • Share this:
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'వెంకటాద్రి-శ్రీపురం' టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, తిరుచానూర్, శ్రీపురం, శ్రీకాళహస్తి ప్రాంతాలను కవర్ చేస్తుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ఇది. ప్యాకేజీ ధర చూస్తే డబుల్ షేరింగ్ అయితే రూ.6800, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.6590. థర్డ్ ఏసీ లేదా స్లీపర్ కేటగిరీలో ప్రయాణం, ఏసీ అకామడేషన్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. థర్డ్ ఏసీ బెర్తులు-6, స్లీపర్ బెర్త్‌లు-12 మాత్రమే ఉంటాయి. ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి టూర్ మొదలవుతుంది.

IRCTC Venkatadri with Sreepuram Tour Package: ఐఆర్‌సీటీసీ 'వెంకటాద్రి-శ్రీపురం' ప్యాకేజీ వివరాలివే...


మొదటి రోజు శుక్రవారం కాచిగూడలో టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి 08:05 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 07:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత కాణిపాకం తీసుకెళ్తారు. ఉదయం 11:30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కాణిపాకంలో దర్శనం ముగుస్తుంది. అక్కడ్నుంచి శ్రీపురం బయల్దేరాలి. మధ్యాహ్నం 02:00 గంటలకు శ్రీపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 03:45 గంటల్లోగా దర్శనం ముగుస్తుంది. అక్కడ్నుంచి శ్రీకాళహస్తి బయల్దేరతారు. రాత్రి 07:30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు. రాత్రి 08:30 గంటల్లోగా దర్శనం ముగుస్తుంది. రాత్రికి శ్రీకాళహస్తిలో బస చేయాలి.




మూడో రోజు తిరుమలకు తీసుకెళ్తారు. ఉదయం 09:30 గంటలలోగా తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలి. మధ్యాహ్నం 01:00 గంటల లోగా దర్శనం ముగుస్తుంది. మధ్యాహ్నం 02:00 గంటల వరకు షాపింగ్ చేయొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత 03:30 గంటలకు తిరుపతికి బయల్దేరాలి. సాయంత్రం తిరుచానూర్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం 06:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే నాలుగో రోజు ఉదయం 06:20 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు



ఇవి కూడా చదవండి:

IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర

IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు శుభవార్త... రూ.7,560 ప్యాకేజీతో దక్షిణ భారతదేశ యాత్ర

IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ
First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు