IRCTC: ప్రేమికులకు శుభవార్త... వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Valentines Day Special Thailand Package | ఈ టూర్ 2020 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 16న టూర్ ముగుస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్ ఉంటాయి.

news18-telugu
Updated: December 19, 2019, 4:57 PM IST
IRCTC: ప్రేమికులకు శుభవార్త... వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
IRCTC: ప్రేమికులకు శుభవార్త... వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రేమికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పిది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ టూర్ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. ఏకంగా థాయ్‌ల్యాండ్ తీసుకెళ్తోంది. 'వాలెంటైన్స్ డే స్పెషల్-థాయ్‌ల్యాండ్' పేరుతో ఈ ప్యాకేజీ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసినవారిలో బ్యాంకాక్, పట్టాయాలో ప్రేమికులు చక్కర్లు కొట్టొచ్చు. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ఇది. ముంబై నుంచి ఈ టూర్ 2020 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 16న టూర్ ముగుస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్ ఉంటాయి.

IRCTC Valentines Day Special Thailand Package: ఐఆర్‌సీటీసీ వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ ప్యాకేజీ వివరాలివే...



ఐఆర్‌సీటీసీ వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్ ముంబైలో 2020 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 02.40 ముంబైలో బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 09.05 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్ సిటీ టూర్, టెంపుల్ టూర్ ఉంటుంది. రిక్లైనింగ్ బుద్ధ, గోల్డెన్ బుద్ధ, మార్బుల్ టెంపుల్ చూసిన తర్వాత ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం హోటల్‌లో విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం చావో ఫ్రాయా రివర్ క్రూజ్‌లో విహరిస్తూ రాత్రి భోజనం చేయాలి. రాత్రికి బ్యాంకాక్‌లోనే బస చేయాలి. ఫిబ్రవరి 13న మెరైన్ పార్క్, సఫారీవాల్డ్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం ఇందిరా మార్కెట్‌లో షాపింగ్ ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున పట్టాయాకు బయల్దేరాలి. దారిలో టైగర్ షోకి తీసుకెళ్తారు. సాయంత్రానికి పట్టాయా చేరుకుంటారు. రాత్రికి వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్, డీజే ఉంటాయి. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. ఫిబ్రవరి 15న కోరల్ ఐల్యాండ్ టూర్ ఉంటుంది. సాయంత్రం ఆల్కజార్ షోకు తీసుకెళ్తారు. రాత్రి పట్టాయాలో బస చేయాలి. ఫిబ్రవరి 16న తిరిగి బ్యాంకాక్‌కు బయల్దేరాలి. దారిలో జెమ్స్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. ఇందిరా మార్కెట్‌లో షాపింగ్ చేయాలి. సాయంత్రానికి సువర్ణభూమి విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. రాత్రి 10:10 గంటలకు బ్యాంకాక్‌లో బయల్దేరితే అర్థరాత్రి 01:35 గంటలకు ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.45,350. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బ్యాంకాక్‌లో 2 రాత్రులు, పట్టాయాలో 2 రాత్రులు 3 స్టార్ కేటగిరీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IRCTC: కేరళ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

IRCTC: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుకింగ్... చేయండి ఇలా

IRCTC Apps: మీరు రైలులో ప్రయాణిస్తుంటారా? ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ ట్రై చేశారా?
First published: December 19, 2019, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading