హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC Travel Insurance | రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ప్రయాణికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము అందుతుంది.

  రైలు టికెట్ బుక్ చేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఐఆర్‌సీటీసీ. ఒకప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి గంటలు గంటలు రైల్వే కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఐఆర్‌సీటీసీ అందించే సేవలతో కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో టికెట్ బుక్ చేయడం చాలా సులువైపోయింది. ఐఆర్‌సీటీసీ దగ్గర ఆరు కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. నిత్యం లక్షలాది మంది ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో ఒకటి బీమా సౌకర్యం. ప్రయాణికులకు అతి తక్కువ ధరకే బీమా సౌకర్యం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. కేవలం 49 పైసలు చెల్లిస్తే చాలు రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది.


  Read this: IRCTC E-Ticket: స్లీపర్ క్లాస్ టికెట్‌తో థర్డ్ ఏసీలో ఉచితంగా ప్రయాణం... ఆటో అప్‌గ్రేడేషన్‌తో ఎన్నో లాభాలు

  ఐఆర్‌సీటీసీ ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఛార్జీలు ఇవే


  ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై మీరు టికెట్ బుక్ చేసుకుంటే రూ.50 లక్షల బీమా లభిస్తుంది. దాంతో పాటు రైలు టికెట్‌పై అదనంగా 49 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్స్యూరెన్స్ కావాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఇన్స్యూరెన్స్ ఎంచుకుంటేనే బీమా లభిస్తుంది. అయితే కన్ఫామ్డ్ టికెట్, ఆర్ఏసీ టికెట్‌కే బీమా లభిస్తుంది. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే బీమా వర్తించదు. అన్ని రైళ్లల్లో స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బెర్తులకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రమే బీమా సేవలు అందుతాయి.


  Read this: Indian Railways: ఈ రిజర్వేషన్ రూల్స్ మారాయి... మీకు తెలుసా?

  ఐఆర్‌సీటీసీ ట్రావెల్ ఇన్స్యూరెన్స్... వివరాలు


  రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ప్రయాణికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము అందుతుంది. టికెట్ బుక్ చేసుకున్న స్టేజీల మధ్యే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. బీమా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


  ప్రమాదవశాత్తు చనిపోయినా, పూర్తిగా శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10 లక్షలు.

  పాక్షికంగా శాశ్వత వైకల్యం బారినపడితే రూ.7.5 లక్షలు.

  గాయాలబారినపడితే ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు.

  మృతదేహం తరలింపు కోసం రూ.10,000.


  టికెట్ బుకింగ్ సమయంలో పాలసీ ఆప్షన్ ఎంచుకుంటే బీమా వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి మెయిల్ కూడా వస్తుంది. మీకు పాలసీ సమాచారం అందగానే నామినీ వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు నామినీ వివరాలు నమోదు చేయకపోతే చట్టపరమైన వారసులకు క్లెయిమ్ సెటిల్ చేస్తారు. ఐఆర్‌సీటీసీ ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌ నియమ నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్


  ఇవి కూడా చదవండి:


  Fixed Deposit: టాప్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే...


  JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...


  IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

  First published:

  Tags: Indian Railways, Insurance, Irctc, Personal Finance, Railways, Travel

  ఉత్తమ కథలు