తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 'భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్'ను ప్రకటించింది. 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారిని దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు తీసుకెళ్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్లో పర్యాటకులు హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, మూకాంబిక, శృంగేరి, ధర్మస్థల, కుక్కి సుబ్రమణ్యం, ఉడుపి, మైసూర్, బేలూర్, హలిబీడు లాంటి ప్రాంతాలు దర్శించొచ్చు. 'భారత దర్శన్ టూరిస్ట్ ట్రైన్' విజయవాడలో బయల్దేరుతుంది. ఖమ్మం, వరంగల్, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్, గుంతకల్ స్టేషన్లలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. తక్కువ ధరకే ఈ ప్యాకేజీని అందిస్తుండటం విశేషం.
ఐఆర్సీటీసీ 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' టూర్ 2020 జనవరి 30న విజయవాడలో బయల్దేరుతుంది. అదే రోజు ఖమ్మం, వరంగల్, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్, గుంతకల్ స్టేషన్లలో పర్యాటకులు రైలు ఎక్కొచ్చు. రాత్రికి హోస్పేట్ చేరుకుంటారు. జనవరి 31న ఉదయం హంపికి తీసుకెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత గోకర్ణకు బయల్దేరాలి. సాయంత్రానికి గోకర్ణ చేరుకుంటారు. ఫిబ్రవరి 1న మహాబలేశ్వర్, మురుడేశ్వర్ తీసుకెళ్తారు. ఫిబ్రవరి 2న మూకాంబిక, శృంగేరి శారదాంబ, ధర్మస్థలలో మంజునాథస్వామి దర్శనం ఉంటాయి. ఫిబ్రవరి 3న ధర్మస్థల నుంచి బయల్దేరి కుక్కి సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఉడిపికి వెళ్లాలి. దర్శనం తర్వాత మంగళూరుకు తీసుకెళ్తారు. అక్కడ మైసూరు రైలు ఎక్కాలి. ఫిబ్రవరి 4న ఉదయం మైసూరుకు చేరుకుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్, కేఆర్ఎస్ డ్యామ్ సందర్శించాలి. రాత్రికి మైసూరులోనే బస చేయాలి.
Visit South India's most iconic temples & bask in the religious fervour of the land. Ideal for families, this trip will leave you with countless memories. To book this budget-friendly package, visit https://t.co/5LVkvURPoE
— IRCTC (@IRCTCofficial) January 19, 2020
ఫిబ్రవరి 5న హసన్ రైల్వే స్టేషన్కు బయల్దేరాలి. అదేరోజు బేలూర్, హలిబీడు ఆలయాల సందర్శన ఉంటుంది. అదేరోజు రాత్రి తిరుగుప్రయాణం మొదలవుతుంది. పర్యాటకులు గుంతకల్, కర్నూల్, మహబూబ్నగర్, కాచిగూడ, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. భారత దర్శన్ టూరిస్ట్ ట్రైన్ ఫిబ్రవరి 6 సాయంత్రానికి విజయవాడ చేరుకుంటుంది. 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పేరుతో ఐఆర్సీటీసీ రూపొందించిన ఈ ప్యాకేజీ స్టాండర్డ్ ధర రూ.9925 కాగా, కంఫర్ట్ ధర రూ.11605. ప్యాకేజీలో రైలు ప్రయాణం, ధర్మశాలలు / హాల్స్ / డార్మిటరీల్లో బస, టీ లేదా కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి కవర్ అవుతాయి. పర్యాటకులు ఈ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
IRCTC: ఆ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేయొద్దంటున్న ఐఆర్సీటీసీ
IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్... 'వాలెంటైన్స్ డే టూర్' తీసుకెళ్తున్న ఐఆర్సీటీసీ
Araku Tour: అరకు టూర్ తక్కువ ధరకే... ఐఆర్సీటీసీ నుంచి స్పెషల్ ప్యాకేజీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP News, Best tourist places, Indian Railway, Indian Railways, Irctc, Karnataka, Khammam, Kurnool, Mahbubnagar, Railways, South Central Railways, Telangana, Telangana News, Telangana update, Telangana updates, Tourism, Vijayawada, Warangal