IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిరిడీ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Tri Jyotirlinga Shirdi Sai Baba Darshan | థర్డ్ ఏసీలో ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఔరంగబాద్‌, షిరిడీలో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 

news18-telugu
Updated: September 12, 2019, 5:42 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిరిడీ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిరిడీ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 12, 2019, 5:42 PM IST
మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలను దర్శించడంతో పాటు షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ రూపొందించింది. ఔరంగాబాద్, షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వరం, భీమశంకర ఆలయం, ఎల్లోరా, బీబీకా మఖ్‌బారా, శనిశింగాపూర్, షిరిడీ, ముక్తిధామం, పంచవటి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. 'త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్' పేరుతో రూపొందించిన టూర్ వైజాగ్ నుంచి నవంబర్ 7న ప్రారంభమవుతుంది. ప్యాకేజీ ధర రూ.18260. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కొచ్చు. థర్డ్ ఏసీలో ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఔరంగబాద్‌, షిరిడీలో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఐఆర్‌సీటీసీ త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Tour: త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్ టూర్ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు వైజాగ్ రైల్వేస్టేషన్‌లో టూర్ మేనేజర్‌ని కలిసి 9 గంటలకు వైజాగ్‌లో రైలు ఎక్కాలి. నవంబర్ 8న ఉదయం 07.30 గంటలకు ఔరంగాబాద్‌కు చేరుకుంటారు. ఆ రోజంతా ఎల్లోరా గుహలు, బీబీకా మక్బారా, గృష్ణేశ్వర్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఔరంగాబాద్‌లోనే బస చేయాలి. నవంబర్ 9న షిరిడీకి బయల్దేరాలి. దారిలో శనిశింగాపూర్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీకి చేరుకున్న తర్వాత హోటల్‌లో విశ్రాంతి తీసుకొని సాయిబాబా దర్శనానికి వెళ్లాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి.

నవంబర్ 10న నాసిక్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. త్రయంబకేశ్వర శివాలయం, ముక్తిధామం, పంచవటి, సీతాగుహ, కపలేశ్వర్ ఆలయం, గోదావరి ఘాట్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి. నవంబర్ 11న భీమశంకర సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి తిరిగి షిరిడీకి తీసుకొస్తారు. రాత్రి షిరిడీలో బస చేసిన తర్వాత నవంబర్ 12న మన్మాడ్‌కు చేరుకోవాలి. సాయంత్రం 4.30 గంటలకు మన్మాడ్‌నుంచి బయల్దేరితే నవంబర్ 13న తెల్లవారుజామున 04.40 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్... విశేషాలివే

IRCTC: ఎయిర్‌‌పోర్టును తలపించేలా ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ లాంజ్... బుక్ చేసుకోండి ఇలా
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...