IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కొడైకెనాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour Package | టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.25,000. ప్యాకేజీలో ప్లైట్ టికెట్లు, ఐదురోజులకు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కలిపే ఉంటాయి.

news18-telugu
Updated: August 4, 2019, 3:31 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కొడైకెనాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కొడైకెనాల్ టూర్... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC సౌత్ ఇండియా టూర్ తీసుకెళ్తోంది. 'ట్రెజర్స్ ఆఫ్ తమిళ్‌నాడు అండ్ ట్రావెన్‌కోర్' పేరుతో ప్యాకేజీ రూపొందించింది. త్రివేండ్రం, కన్యాకుమారి, రామేశ్వరం, కొడైకెనాల్, మధురై ప్రాంతాలకు టూర్ తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ హైదరాబాద్‌లో అక్టోబర్ 8, 24 తేదీల్లో ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు / 6 రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.25,000. ప్యాకేజీలో ప్లైట్ టికెట్లు, ఐదురోజులకు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కలిపే ఉంటాయి. ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Treasures of Tamil Nadu And Travancore: టూర్ ప్యాకేజీ వివరాలివే...



అక్టోబర్ 8న ఉదయం 11:40 గంటలకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1:30 గంటలకు త్రివేండ్రమ్ చేరుకుంటారు. హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నేపియర్ మ్యూజియం, పద్మనాభస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి త్రివేండ్రంలోనే బస చేయాలి. అక్టోబర్ 9న ఉదయం కన్యాకుమారికి తీసుకెళ్తారు. దారిలో పద్మనాభపురం ప్యాలెస్ సందర్శన ఉంటుంది. కన్యాకుమారిలో హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాక్ మెమొరియల్, సన్‌సెట్ పాయింట్, బీచ్, ఆలయ సందర్శన ఉంటుంది. అక్టోబర్ 10న ఉదయం రామేశ్వరం బయల్దేరాలి. దారిలో తిరుచెండూర్‌ సందర్శన ఉంటుంది. సాయంత్రానికి రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి రామేశ్వరంలోనే బస చేయాలి.

అక్టోబర్ 11న రామేశ్వరం లోకల్ టూర్ ఉంటుంది. ఆలయాలు, కలాం హౌజ్ సందర్శన తర్వాత మధ్యాహ్నం కొడైకెనాల్ బయల్దేరాలి. రాత్రికి కొడైకెనాల్‌లోనే బస చేయాలి. అక్టోబర్ 12న కొడైకెనాల్‌లో సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి కొడైకెనాల్‌లోనే బస ఉంటుంది. అక్టోబర్ 13న కొడైకెనాల్ నుంచి మధురై బయల్దేరాలి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మీనాక్షి ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు మధురై ఎయిర్‌పోర్ట్ చేరుకోవాలి. రాత్రి 9:35 గంటలకు మధురై ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:EPF Withdraw: ఏ కారణానికి ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?

RBI: లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్... ఇక ఆ ఛార్జీలు ఉండవు

WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?
Published by: Santhosh Kumar S
First published: August 4, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading