Home /News /business /

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Balaji Pratyeka Pravesha Darshnam | ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి ఏసీ హోటల్‌లో అకామడేషన్, 1 బ్రేక్‌ఫాస్ట్, 2 లంచ్, 1 డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

ఇంకా చదవండి ...
    తిరుమల శ్రీవారి భక్తులకు గొప్ప శుభవార్త. తిరుమల తిరుపతికి ఐఆర్‌సీటీసీ మరో ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటికే రైలు ద్వారా తిరుమలకు ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇప్పుడు ఫ్లైట్‌లో భక్తులను తిరుపతికి తీసుకెళ్తోంది. 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15, నవంబర్ 22, నవంబర్ 29, డిసెంబర్ 6, డిసెంబర్ 27 తేదీల్లో ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. భక్తులు ఐఆర్‌సీటీసీ టూరిజంకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11780. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి ఏసీ హోటల్‌లో అకామడేషన్, 1 బ్రేక్‌ఫాస్ట్, 2 లంచ్, 1 డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.


    IRCTC Tirupati Balaji Pratyeka Pravesha Darshnam: ఐఆర్‌సీటీసీ తిరుపతి ప్యాకేజీ వివరాలివే...


    ఐఆర్‌సీటీసీ తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్యాకేజీ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. రెండు రోజులు ఒక రాత్రి టూర్ ప్యాకేజీ ఇది. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించొచ్చు. మొదటి రోజు ఉదయం 06:45 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 08:00 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీనివాసమంగాపురం టూర్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి తీసుకెళఅతారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వచ్చిన తర్వాత భోజనం చేసి అక్కడే బస చేయాలి. రెండో రోజు ఉదయం తిరుమల కొండకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుచానూర్ తీసుకెళ్తారు. రాత్రి 08:30 గంటలకు తిరుపతిలో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్‌కు 09:40 గంటలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



    ఇవి కూడా చదవండి:

    IRCTC: రైల్వే ప్రయాణికులకు 49 పైసలకే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తున్న ఐఆర్‌సీటీసీ

    IRCTC Araku Tour: అద్దాల రైలులో 'ఆంధ్రా ఊటీ' టూర్... ఐఆర్‌సీటీసీ అరకు ప్యాకేజీ వివరాలివే

    IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Irctc, Srikalahasti, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati

    తదుపరి వార్తలు