IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC The Glory Kingdom Nepal Tour Package | టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.50600. హోటల్స్‌లో ఏసీ అకామడేషన్, సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్సు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్, డిన్నర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

news18-telugu
Updated: September 24, 2019, 4:51 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం, image: Pixabay)
news18-telugu
Updated: September 24, 2019, 4:51 PM IST
నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి శుభవార్త. 'ది గ్లోరీ కింగ్డమ్-నేపాల్' పేరుతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ రూపొందించింది. లక్నో, లుంబినీ, పోఖారా, కురింతార్, ఖాట్మండు ప్రాంతాలకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. 13 రోజులు, 12 రాత్రుల టూర్ ఇది. అక్టోబర్ 19న టూర్ ప్రారంభం అవుతుంది. డీలక్స్, కంఫర్ట్, స్టాండర్డ్ క్లాస్‌లో విజయవాడ, వరంగల్ నుంచి టూర్ బుక్ చేసుకోవచ్చు. వేర్వేరు క్లాస్‌లకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.50600. హోటల్స్‌లో ఏసీ అకామడేషన్, సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్సు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్, డిన్నర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఎంట్రెన్స్ ఫీజులు, స్పెషల్ దర్శనం ఛార్జీలు, ఇతర ఖర్చులు ప్యాకేజీలో కవర్ కావు. ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Nepal Tour: ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్ ప్యాకేజీ వివరాలివే


అక్టోబర్ 19న మధ్యాహ్నం 01.30 గంటలకు తిరిచ్చిలో టూర్ ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు విజయవాడలో తెల్లవారుజామున 03.30 గంటలకు, వరంగల్‌లో ఉదయం 07.00 గంటలకు రైలు చేరుకుంటుంది. అక్టోబర్ 21న మధ్యాహ్నం 03.00 గంటలకు లక్నోకు రైలు చేరుకుంటుంది. రాత్రికి లక్నోలో బస చేయాలి. అక్టోబర్ 22న లక్నో సిటీలో బడా ఇమాంబారా, చోటా ఇమాంబారా, డాక్టర్ అంబేద్కర్ పార్క్, రుమీ దర్వాజా, బేగం హజ్రత్ మహల్ పార్క్ సందర్శన ఉంటుంది. రాత్రికి లక్నోలో బస చేయాలి. అక్టోబర్ 23న లక్నో నుంచి సునౌలీకి బయల్దేరాలి. దారిలో బుద్ధుడి జన్మస్థలం లుంబినీ సందర్శన ఉంటుంది. రాత్రికి సునౌలీలో బస చేయాలి. అక్టోబర్ 24న సునౌలీ నుంచి పోఖారాకు బయల్దేరాలి. రాత్రికి పోఖారాలో బస చేయాలి. అక్టోబర్ 25న పోఖారా సైట్ సీయింగ్‌లో భాగంగా బిందుబాషిణి ఆలయం, దేవీ ఫాల్, మహేంద్ర కేవ్, వాల్డ్ పీస్ పగోడా సందర్శన, పెహ్వాలేక్‌లో బోటింగ్ ఉంటుంది.

అక్టోబర్ 26న పోఖారా నుంచి ఖాట్మండుకు బయల్దేరాలి. కేబుల్ కార్‌లో మనకామనకు చేరుకోవాలి. రాత్రికి ఖాట్మండు చేరుకుంటారు. అక్టోబర్ 27న ఖాట్మండు సిటీ టూర్‌లో భాగంగా దర్బార్ స్క్వేర్, పశుపతినాథ్, బుద్ధ నీలకంఠ బౌద్ధ్‌నాథ్, జల్ నారాయణ్, పటాన్, భక్తపూర్ సందర్శన ఉంటుంది. అక్టోబర్ 28న నాగర్‌కోట్ సందర్శన ఉంటుంది. అక్టోబర్ 29న ఖాట్మండు నుంచి బయల్దేరి భైరావాకు చేరుకోవాలి. మధ్యాహ్నానికి గోరఖ్‌పూర్ చేరుకోవాలి. సాయంత్రం గోరఖ్‌పూర్‌లో బయల్దేరితే అక్టోబర్ 29న రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. అక్టోబర్ 31న తెల్లవారుజామున 02.30 గంటలకు వరంగల్‌కు, ఉదయం 06.00 గంటలకు విజయవాడకు రైలు చేరుకుంటుంది. నవంబర్ 1న 07.00 గంటలకు తిరుచ్చి చేరుకోవడంతో నేపాల్ టూర్ ముగుస్తుంది.

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

IRCTC: తిరుమల తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ వివరాలివే...

IRCTC: షిరిడీ వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...