news18-telugu
Updated: January 8, 2020, 3:22 PM IST
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ప్యాకేజీ వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
తక్కువ బడ్జెట్లో దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారిని తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. 2020 ఫిబ్రవరి 25న టూర్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. కేరళ రాజధాని త్రివేండ్రం, తమిళనాడులోని కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చిరాపల్లి లాంటి పర్యాటక ప్రాంతాల్లో విహరించొచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.23800. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,500. ప్యాకేజీలో నాలుగు రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఆసక్తిగలవారు
https://www.irctctourism.com/ వెబ్సైట్లో ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
IRCTC Tour: ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టూర్ వివరాలివే...
ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టూర్ 2020 ఫిబ్రవరి 25న హైదరాబాద్లో మొదలవుతుంది. ఉదయం 06:35 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే 10:25 గంటలకు త్రివేండ్రం చేరుకుంటారు. అక్కడ్నుంచి నేపియర్ మ్యూజియం, పద్మనాభస్వామి ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఫిబ్రవరి 26న త్రివేండ్రం నుంచి కన్యాకుమారి బయల్దేరాలి. దారిలో పద్మనాభపురం ప్యాలెస్ సందర్శన ఉంటుంది. కన్యాకుమారి చేరుకున్న తర్వాత రాక్ మెమొరియల్, సన్సెట్ పాయింట్, బీచ్, ఆలయ సందర్శన ఉంటాయి. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. ఫిబ్రవరి 27న కన్యాకుమారి నుంచి రామేశ్వరం బయల్దేరాలి. సాయంత్రం రామనాథస్వామి అలయం, ఇతర ప్రాంతాలు సందర్శించాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.
ఫిబ్రవరి 28న తెల్లవారుజామున ధనుష్కోడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత కలాం నివాసాన్ని సందర్శించాలి. మధ్యాహ్నం మదురైకి బయల్దేరాలి. మీనాక్షి ఆలయ సందర్శన తర్వాత తిరుచ్చిరాపల్లికి తీసుకెళ్తారు. రాత్రికి తిరుచ్చిరాపల్లిలోనే బస చేయాలి. ఫిబ్రవరి 29న రంగనాథస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తంజావూరుకు తీసుకెళ్తారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించిన తర్వాత తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకెళ్తారు. రాత్రి 11:50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 02:10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి
IRCTC: తక్కువ ధరకే పూరీ, గయ యాత్ర... తెలుగు రాష్ట్రాల నుంచి టూర్ ప్యాకేజీ
IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు
Published by:
Santhosh Kumar S
First published:
January 8, 2020, 3:02 PM IST