Tejas Express: రైలు టికెట్ కొంటే ఇంట్లో వస్తువులకూ ఇన్స్యూరెన్స్

IRCTC Tejas Express | ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉచితంగా అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. దీంతో పాటు ఇంట్లోని వస్తువులకూ రూ.1 లక్ష బీమా సదుపాయాన్నీ ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తోంది.

news18-telugu
Updated: October 8, 2019, 2:30 PM IST
Tejas Express: రైలు టికెట్ కొంటే ఇంట్లో వస్తువులకూ ఇన్స్యూరెన్స్
Tejas Express: రైలు టికెట్ కొంటే ఇంట్లో వస్తువులకూ ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన కొత్తకొత్త విషయాలు ప్రయాణికుల్లో ఆ రైలుపై ఆసక్తిని పెంచుతున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్ కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్నో-న్యూఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC తొలి ప్రైవేట్ రైలు నడిపే బాధ్యతల్ని తీసుకుంది. ప్రస్తుతం తేజస్ ఎక్స్‌ప్రెస్ లక్నో-న్యూఢిల్లీ మధ్య సేవలు అందిస్తోంది. ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉచితంగా అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. దీంతో పాటు ఇంట్లోని వస్తువులకూ రూ.1 లక్ష బీమా సదుపాయాన్నీ ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తోంది. అంటే ఇంట్లో వస్తువులు దొంగతనానికి గురైతే రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. రైలు టికెట్ బుక్ చేసిన ప్రయాణికులకు పికప్ సర్వీస్, రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్, అడ్వాన్స్ రిజర్వేషన్, నామినల్ క్యాన్సలేషన్ ఛార్జీలు, లగ్జరీ లాంజ్, రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు... ఇలా ఎన్నో విశేషాలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాయి. రైలు గంట ఆలస్యంగా నడిస్తే రూ.100, రెండు గంటలు ఆలస్యంగా నడిస్తే రూ.250 నష్టపరిహారాన్ని ఇస్తుంది ఐఆర్‌సీటీసీ. లక్నో నుంచి న్యూ ఢిల్లీకి ఏసీ ఛైర్ కార్ టికెట్ ధర రూ.1,125 కాగా, ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్ టికెట్ ధర రూ.2,310. ఇక న్యూ ఢిల్లీ నుంచి లక్నోకు తేజస్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలు చూస్తే ఏసీ ఛైర్ కార్‌కు రూ.1,280, ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్‌కు రూ.2,450. ఎయిర్‌లైన్స్‌లో ఉన్నట్టు డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉంది.

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Redmi 8: భారీ బ్యాటరీ, సరికొత్త కెమెరా ఫీచర్లతో రేపే రెడ్‌మీ 8 రిలీజ్Amazon Sale: అమెజాన్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్... ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
Published by: Santhosh Kumar S
First published: October 8, 2019, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading