IRCTC: గుజరాత్‌లో రన్ ఉత్సవానికి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

IRCTC Rann Utsav Tour Package | గుజరాత్ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే ఈ ఉత్సవాల్లో పాల్గొనాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC.

news18-telugu
Updated: October 15, 2019, 12:16 PM IST
IRCTC: గుజరాత్‌లో రన్ ఉత్సవానికి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ
IRCTC: గుజరాత్‌లో రన్ ఉత్సవానికి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం, image: Rann Utsav Official/Facebook)
news18-telugu
Updated: October 15, 2019, 12:16 PM IST
ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగి రన్ ఆఫ్ కచ్ ఉత్సవానికి గుజరాత్ మరోసారి సిద్ధమవుతోంది. రన్ ఉత్సవ్‌గా ఈ వేడుకకు ఎంతో ప్రాచుర్యం ఉంది. గుజరాత్‌కు పర్యాటకుల్ని ఆకర్షించే ఈ ఉత్సవాలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. 5,00,000 చదరపు అడుగు టెంట్లు వేసి పర్యాటకుల్ని ఆకర్షిస్తారు నిర్వాహకులు. ఇలాంటి ఫెస్టివల్ భారతదేశంలో ఇదే అతిపెద్దది. గుజరాత్ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే ఈ ఉత్సవాల్లో పాల్గొనాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీ ఇది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.27563. ఫ్లైట్ టికెట్లు, రెండు రాత్రులు ఏసీ టెంట్ అకామడేషన్, భోజనం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్‌, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


IRCTC Rann Utsav Tour Package: ఐఆర్‌సీటీసీ రన్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ వివరాలు




ఐఆర్‌సీటీసీ రన్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ నవంబర్ 16న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో ఉదయం 08:35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10:30 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 02:50 గంటలకు కండ్లాకు ఫ్లైట్ ఎక్కితే 03:45 కండ్లాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా రన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తారు. డీలక్స్ ఏసీ స్విస్ కాటేజీలో బస ఉంటుంది. రాత్రి కచ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తారు. అక్కడే భోజనం చేయాల్సి ఉంటుంది. నవంబర్ 17న సూర్యోదయం వీక్షించేందుకు తీసుకెళ్తారు. రోజంతా ఫెస్టివల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. హస్తకళల గ్రామం 'గాంధీ ను గామ్‌'కు తీసుకెళ్తారు. రాత్రికి తిరిగి కచ్ ఫెస్టివల్‌కు చేరుకోవాలి. నవంబర్ 18న భుజ్ సైట్ సీయింగ్, స్వామి నారాయణ్ ఆలయ సందర్శన ఉంటాయి. మధ్యాహ్నం 02:30 గంటలకు కండ్లా విమానాశ్రయం దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 04:05 గంటలకు అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కితే 05:00 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. రాత్రి 08:30 గంటలకు అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Loading...
Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు



ఇవి కూడా చదవండి:

SBI Alerts: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా? రాకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోండి

Smartphone: రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్

Credit Card Limit: క్రెడిట్ కార్డు ఉందా? లిమిట్ ఎప్పుడు పెంచుకోవాలో తెలుసా?
First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...