IRCTC OFFERS RAMAYANA YATRA WITH SHANKARI DEVI SHAKTHI PEETH TOUR PACKAGE FROM HYDERABAD SS
IRCTC Tour: ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర... ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి
IRCTC Ramayana Yatra: శ్రీరామ భక్తుల కోసం ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర... ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Ramayana Yatra With Shankari Devi Shakthi Peeth | నాలుగు రాత్రులు త్రీ స్టార్ హోటల్లో బస, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, ఆలయాల సందర్శన, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్సైట్లో బుక్ చేయాలి.
శ్రీరామ భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC రామ భక్తుల కోసం రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలైన కొలంబో, డంబుల్లా, కాండీ, నెగొంబాకు తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ 2020 మార్చి 27న ప్రారంభం అవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.39,250. నాలుగు రాత్రులు త్రీ స్టార్ హోటల్లో బస, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, ఆలయాల సందర్శన, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్సైట్లో బుక్ చేయాలి.
IRCTC Ramayana Yatra: ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర వివరాలివే...
ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర 2020 మార్చి 27న ఉదయం హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. ఉదయం 10:15 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడ్నుంచి డంబుల్లాకు తీసుకెళ్తారు. దారిలో మునీశ్వరం, మనవేరి ఆలయాలను సందర్శించొచ్చు. రాత్రికి డంబుల్లాలో బస చేయాలి. మార్చి 28న ట్రింకోమలీకి తీసుకెళ్తారు. తిరుకోనేశ్వర్, లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించిన తర్వాత కాండీకి బయల్దేరాలి. శ్రీలంకలోనే అతిపెద్ద హిల్ స్టేషన్ అయిన కాండీలో జెమ్స్ ఫ్యాక్టరీ, గౌతమ బుద్ధ ఆలయాన్ని సందర్శించిన తర్వాత రాత్రికి కాండీలోనే బస చేయాలి. మార్చి 29న నువారాఏలియా టూర్ ఉంటుంది. రాంబోడాలో శ్రీ భక్త హనుమాన్ ఆలయం, సీతా అమ్మన్ ఆలయం, సీతా ఏలియా, అశోక వాటికా సందర్శించాలి. రాత్రికి కాండీలోనే బస చేయాలి. మార్చి 30న కొలంబోకు బయల్దేరాలి. కొలంబో సిటీ టూర్, షాపింగ్ తర్వాత నెగోంబో వెళ్లాలి. రాత్రికి అక్కడే బస చేయాలి. మార్చి 31న ఉదయం 07:25 గంటలకు శ్రీలంకలో ఫ్లైట్ ఎక్కితే 09:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.