IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Land of Kings Tour Package | ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి బుక్ చేయొచ్చు. ప్యాకేజీలో థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

news18-telugu
Updated: December 6, 2019, 5:43 PM IST
IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ రాజస్తాన్ టూర్ ప్రకటించింది. పింక్ సిటీ జైపూర్‌, సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, అజ్మేర్, పుష్కర్‌తో పాటు న్యూ ఢిల్లీ కూడా తీసుకెళ్లనుంది. ల్యాండ్ ఆఫ్ కింగ్స్ పేరుతో ఈ ప్యాకేజీ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. టూర్ సికింద్రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర స్లీపర్ అయితే రూ.20180, థర్డ్ ఏసీకి రూ.23280. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. 8 రాత్రులు, 9 రోజుల టూర్ ఇది. ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి బుక్ చేయొచ్చు. ప్యాకేజీలో థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Land of Kings Tour Package: ఐఆర్‌సీటీసీ రాజస్తాన్ ప్యాకేజీ వివరాలివే...



మొదటి రోజు ఉదయం 06:50 గంటలకు సికింద్రాబాద్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆ రోజుతో పాటు రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 09:05 గంటలకు న్యూ ఢిల్లీ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెషప్ కావాలి. ఆ తర్వాత జైపూర్ బయల్దేరాలి. దారిలో అంబర్ ఫోర్ట్ సందర్శించాల్సి ఉంటుంది. రాత్రికి జైపూర్ చేరుకుంటారు. రాత్రికి జైపూర్‌లో బస చేయాలి. మూడో రోజు జైపూర్‌లో సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్, హవామహల్, జంతర్ మంతర్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అజ్మేర్‌కు బయల్దేరాలి. అజ్మేర్ దర్గా సందర్శించిన తర్వాత పుష్కర్ వెళ్లాలి. దేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం, పుష్కర్ లేక్ సందర్శించాలి. రాత్రికి పుష్కర్‌లోనే బస చేయాలి. నాలుగో రోజు పుష్కర్ నుంచి ఉదయ్‌పూర్ బయల్దేరాలి. జగదీష్ ఆలయం, సిటీ ప్యాలెస్ సందర్శించాలి.

ఐదో రోజు ఉదయ్‌పూర్ నుంచి మౌంట్ అబూ బయల్దేరాలి. రాజస్తాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ ఈప్రాంతం. దిల్వారా జైన్ ఆలయాల సందర్శన్, సన్‌సెట్ పాయింట్, నక్కి లేక్ సందర్శించాలి. రాత్రికి మౌంట్ అబూలోనే బస చేయాలి. ఆరో రోజు మౌంట్ అబూ నుంచి జోధ్‌పూర్ బయల్దేరాలి. మెహరాన్‌గఢ్ ఫోర్ట్, ఉమ్మైద్ భవన్ ప్యాలెస్, మ్యూజియం సందర్శించాలి. రాత్రికి జోధ్‌పూర్‌లో బస చేయాలి. ఏడోరోజు జైపూర్‌కు బయల్దేరాలి. రాత్రికి జైపూర్‌ బస చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు జైపూర్ నుంచి న్యూ ఢిల్లీ బయల్దేరాలి. సాయంత్రం 04:00 గంటలకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కితే తొమ్మిదో రోజు సాయంత్రం 07:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:IRCTC: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుకింగ్... చేయండి ఇలా

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ... ధర తక్కువే
Published by: Santhosh Kumar S
First published: December 6, 2019, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading