IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ప్యారిస్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Paris Swiss Delight Tour Package | ప్యాకేజీలో ఢిల్లీ నుంచి ప్యారిస్‌కు, జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి (వయా దుబాయ్) ఫ్లైట్ ఛార్జీలు, 3 రాత్రులు ప్యారిస్, సెంట్రల్ స్విట్జర్లాండ్‌లో 3 స్టార్ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, డీలక్స్ బస్‌లో సైట్‌సీయింగ్ నార్మల్ వీసా, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కలిపి ఉంటాయి.

news18-telugu
Updated: August 1, 2019, 7:09 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ప్యారిస్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ప్యారిస్ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 1, 2019, 7:09 PM IST
ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకుంటున్నవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'ప్యారిస్-స్విస్ డిలైట్' పేరుతో టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీతో దుబాయ్, స్విట్జర్లాండ్, డిస్నీల్యాండ్, జ్యూరిచ్‌, ప్యారిస్‌లో చక్కర్లు కొట్టొచ్చు. ఢిల్లీ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.1,52,950. ప్యాకేజీలో ఢిల్లీ నుంచి ప్యారిస్‌కు, జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి (వయా దుబాయ్) ఫ్లైట్ ఛార్జీలు, 3 రాత్రులు ప్యారిస్, సెంట్రల్ స్విట్జర్లాండ్‌లో 3 స్టార్ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, డీలక్స్ బస్‌లో సైట్‌సీయింగ్ నార్మల్ వీసా, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కలిపి ఉంటాయి. ఐఆర్‌సీటీసీ 'ప్యారిస్-స్విస్ డిలైట్' ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


IRCTC Paris-Swiss Delight: ఐఆర్‌సీటీసీ ప్యారిస్-స్విస్ టూర్ వివరాలివే...




ఐఆర్‌సీటీసీ ప్యారిస్-స్విస్ టూర్ 2019 అక్టోబర్ 30న ఢిల్లీలో మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 దగ్గరకు చేరుకోవాలి. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 9:25 గంటలకు దుబాయ్ ఫ్లైట్ ఎక్కాలి. రాత్రి 11:55 గంటలకు దుబాయ్ చేరుకుంటారు. అక్టోబర్ 31న తెల్లవారుజామున 03:20 గంటలకు దుబాయ్ నుంచి చార్లెస్ డి గాల్లేకు కనెక్టింగ్ ఫ్లైట్‌ ఉంటుంది. చార్లెస్ డి గాల్లేకు ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో ప్రెషప్ అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత రివర్ క్రూజ్‌లో విహారం ఉంటుంది. రాత్రికి ప్యారిస్‌లో బస చేయాలి. నవంబర్ 1న ప్యారిస్ నుంచి డిస్నీల్యాండ్‌కు తీసుకెళ్తారు. ఆ రోజంతా డిస్నీల్యాండ్‌లో విహారం ఉంటుంది. రాత్రికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. నవంబర్ 2న ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు తీసుకెళ్తారు. ఆ రోజంతా ప్యారిస్‌లో సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి ప్యారిస్‌లోనే బస చేయాలి.
Loading...
IRCTC tours, IRCTC paris tour, IRCTC Switzerland tour, IRCTC Paris Swiss Delight, IRCTC tourism, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ ప్యారిస్ టూర్, ఐఆర్‌సీటీసీ స్విట్జర్లాండ్ టూర్, ఐఆర్‌సీటీసీ ప్యారిస్ స్విస్ డిలైట్, ఐఆర్‌సీటీసీ టూరిజం
ప్రతీకాత్మక చిత్రం


నవంబర్ 3న ప్యారిస్ నుంచి సెంట్రల్ స్విట్జర్లాండ్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సెంట్రల్ స్విట్జర్లాండ్‌కు చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత షాపింగ్‌కు వెళ్లాలి. రాత్రికి సెంట్రల్ స్విట్జర్లాండ్‌లోని హోటల్‌లో బస చేయాలి. నవంబర్ 4న జ్యూరిచ్‌కు తీసుకెళ్తారు. కేబుల్ కార్‌లో విహారం, సిటీలో సైట్ సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటర్‌లాకెన్ సిటీ టూర్ ఉంటుంది. రాత్రికి హోటల్‌లో బస చేయాలి. నవంబర్ 5న జ్యూరిచ్ నుంచి Jungfraujoch, Alpine Sensation, Sphinx Observation Terrace and Plateau ప్రాంతాల్లో విహారం ఉంటుంది. యూరప్‌లోనే అతిపెద్ద Aletsch Glacier ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత Lucerne City Tour మొదలవుతుంది. పికాసో మ్యూజియం సందర్శన, క్రూజ్ రైజ్ ఉంటాయి. రాత్రికి హోటల్‌లో బస చేయాలి. నవంబర్ 6న సెంట్రల్ స్విట్జర్లాండ్ నుంచి జ్యూరిచ్ టూర్ ఉంటుంది. నేషనల్ మ్యూజియం సందర్శన, షాపింగ్ తర్వాత దుబాయ్‌కు ఫ్లైట్‌లో బయల్దేరాలి. నవంబర్ 7న ఉదయం 09:50 గంటలకు ఢిల్లీకి ఫ్లైట్‌లో బయల్దేరాలి. మధ్యాహ్నం 02:45 గంటలకు ఢిల్లీకి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

New Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా... కొత్త ఫైన్స్ ఇవే

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే

Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం
First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...