Home /News /business /

IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్

IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్

IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Pancha Devalayam Tour | తిరుమల వెళ్లే భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

    తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం రూపొందించిన ప్యాకేజీ ఇది. 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7,010. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒకరోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాలి.

    IRCTC Kashmir Tour: కాశ్మీర్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... తులీప్ గార్డెన్ ఫెస్టివల్ చూడొచ్చు

    IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవాకు హనీమూన్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

    IRCTC Pancha Devalayam Tour: ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...


    Day 1: మొదటి రోజు ఉదయం తిరుపతిలో టూర్ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తులను ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ కావాలి. ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.

    IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే

    IRCTC Tour: మేఘాలలో తేలుతూ మేఘాలయాకు హనీమూన్ టూర్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

    Day 2: మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుమలకు తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భక్తులు తిరుమల దర్శనం కోసం ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మధ్యాహ్నం 1 గంటలోగా దర్శనం పూర్తవుతుంది. 2 గంటల వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ తర్వాత తిరిగి తిరుపతి చేరుకోవాలి. ఆ తర్వాత శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సందర్శించొచ్చు. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తులను డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC Tourism, Kanipakam, Srikalahasti, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirupati, Tourism

    తదుపరి వార్తలు