హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల ప్యాకేజీ రూ.990 మాత్రమే... శ్రీవారి దర్శనం కూడా

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల ప్యాకేజీ రూ.990 మాత్రమే... శ్రీవారి దర్శనం కూడా

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

IRCTC Tirupathi Tour | తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ తిరుమల ఒకరోజు టూర్ ప్యాకేజీని మళ్లీ ప్రారంభించింది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల్ని సడలిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోయారు ప్రజలు. తీర్థయాత్రలు, టూర్లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి తగ్గడంతో మళ్లీ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీని తిరిగి ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు తిరుమలలో శ్రీవారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. అంటే ప్యాకేజీలోనే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కలిపి ఉంటుంది.

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

Cardless EMI: ఇక క్రెడిట్ కార్డ్ అవసరం లేదు... 'కార్డ్‌లెస్ ఈఎంఐ' మీకోసమే

తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగానే ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులను ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట లోపే దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత తిరుమలలోనే భోజనం చేయాలి. భక్తులు సొంత ఖర్చులతోనే భోజనం చేయల్సి ఉంటుంది.

తిరుమలలో దర్శనం పూర్తైన తర్వాత తిరుచానూర్ బయల్దేరాలి. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది. ఒకవేళ తిరుమలలో శ్రీవారి దర్శనం ఆలస్యం అయితే తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే అవకాశం ఉండదు.

Salary: ఉద్యోగులకు అలర్ట్... వెంటనే ఈ పనిచేయకపోతే ఈ నెల జీతం రాదు

Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్


తిరుమలలో ఒకరోజులోనే దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల వెళ్లేందుకు వాహన సదుపాయం, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ మాత్రమే కవర్ అవుతాయి. భోజనం, వసతి, ఇతర సదుపాయాలేవీ ఇందులో కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirupati, Tourism, Tourist place, Train, Train tickets, Travel

ఉత్తమ కథలు