IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే

IRCTC Natural Nepal Tour Package | ఫ్లైట్ టికెట్లు, రెండు రాత్రులు లుంబినీలో, రెండు రాత్రులు పోఖారాలో, రెండు రాత్రులు ఖాట్మండులో, ఒక రాత్రి చిత్వాన్‌‌లో హోటల్‌లో బసతో పాటు, ఏడు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ డీలక్స్ బస్సులో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

news18-telugu
Updated: August 22, 2019, 4:10 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు విదేశాలకూ టూర్ తీసుకెళ్తోంది. హిమాలయాల పాదాల దగ్గరున్న అందమైన దేశం నేపాల్‌కు హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. 'నేచురల్ నేపాల్' పేరుతో అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.36,680. నేపాల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను బుద్దుడి జన్మస్థానమైన లుంబినీ, నేపాల్ రాజధాని ఖాట్మండు, పోఖారా, చిత్వాన్ నేషనల్ పార్క్‌ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫ్లైట్ టికెట్లు, రెండు రాత్రులు లుంబినీలో, రెండు రాత్రులు పోఖారాలో, రెండు రాత్రులు ఖాట్మండులో, ఒక రాత్రి చిత్వాన్‌‌లో హోటల్‌లో బసతో పాటు, ఏడు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ డీలక్స్ బస్సులో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. నేచురల్ నేపాల్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Natural Nepal Tour Package: ఐఆర్‌సీటీసీ నేచురల్ నేపాల్ టూర్ ప్యాకేజీ వివరాలివే



అక్టోబర్ 18న హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:05 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి లుంబినీకి వాహనంలో తీసుకెళ్తారు. వాల్డ్ పీస్ పగోడా, దేవీ టెంపుల్‌తో పాటు స్థానికంగా ఉండే బౌద్ధ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి లుంబినీలోనే బస చేయాలి. అక్టోబర్ 19న లుంబినీ నుంచి పోఖారా బయల్దేరాలి. ఫీవా లేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి పోఖారాలో బస చేయాలి. అక్టోబర్ 20న పోఖారాలో సైట్‌సీయింగ్ ఉంటుంది. తెల్లవారుజామున సారంగ్‌కోట్ వ్యూపాయింట్ దగ్గర సూర్యోదయం చూడాలి. ఆ తర్వాత బింద్యాబాసిని మందిర్, దావి ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహల సందర్శన ఉంటుంది. రాత్రికి పోఖారాలో బస చేయాలి. అక్టోబర్ 21న పోఖారా నుంచి ఖాట్మండుకు బయల్దేరాలి. దారిలో మనోకామ్న ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ తర్వాత రాత్రికి ఖాట్మండులో బస చేయాలి.

అక్టోబర్ 22న ఖాట్మండులో పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలేస్, స్వయంభునాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఖాట్మండులో బస చేయాలి. అక్టోబర్ 23న ఖాట్మండు నుంచి చిత్వాన్ బయల్దేరాలి. సాయంత్రం థరు గ్రామం, సన్‌సెట్ వ్యూ పాయింట్‌కు వెళ్లాలి. రాత్రికి చిత్వాన్‌లో బస చేయాలి. అక్టోబర్ 24న చిత్వాన్ నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత లుంబినీకి బయల్దేరాలి. రాత్రికి లుంబినీలో బస చేయాలి. అక్టోబర్ 25న లుంబినీ నుంచి గోరఖ్‌పూర్ బయల్దేరాలి. గోరఖ్‌పూర్‌లో సాయంత్రం 16:30 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6:50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:IRCTC: ఎయిర్‌‌పోర్టును తలపించేలా ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ లాంజ్... బుక్ చేసుకోండి ఇలా

IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

IRCTC: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్...
Published by: Santhosh Kumar S
First published: August 22, 2019, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading